తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా విడుదలైన టాప్ సినిమాలు ఫిబ్రవరి నెలలో ఓటీటీకి రానున్నాయి. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ విడుదలయ్యాయి. అయితే, వీటన్నింటిలో వెంకటేశ్ మూవీనే సంక్రాంతి విన్నర్‌గా నిలిచిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో కూడా ఈ చిత్రమే పైచెయి సాధించింది. ఇప్పుడు మళ్లీ ఈ మూడు సినిమాలు ఓటీటీలో పోటీ పడనున్నాయి.
'గేమ్ ఛేంజర్'-- అమెజాన్ ప్రైమ్
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్ ఛేంజర్ (Game Changer) చేరిపోయింది. అయితే, ఫేక్ కలెక్షన్స్ ఇచ్చారంటూ నెట్టింట భారీగా ట్రోల్స్ రావడంతో తరువాతి రోజుల్లో వాటి వివరాలు ప్రకటించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ఫిబ్రవరి 14న గేమ్ ఛేంజర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'డాకు మహారాజ్'--నెట్‌ఫ్లిక్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్'(Daaku Maharaaj) బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే, నైజాం, హిందీ ఏరియాలో ఏమాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. బాబీ లొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‍పై అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ డేట్‍పై రూమర్లు స్ట్రాంగ్‍గానే వినిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్(Netflix) వేదికగా ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ వంటి స్టార్స్ నటించారు.
'సంక్రాంతికి వస్తున్నాం'-- జీ5
విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam). ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ మార్క్‌కు దగ్గరలో ఉంది. ఈ సినిమాతో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్‌కు మంచి లాభాలు వచ్చాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకుంది. వాస్తవంగా ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలోకి రావాలి. కానీ, థియటర్ రన్ మెరుగ్గా ఉండటంతో వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment