
వెంకటేశ్‌కు రామ్‌చరణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఇవ్వాలనుకుంటున్నారట. విచిత్రంగా ఉంది కదూ.. ‘డ్రైవింగ్ లెసెన్స్’ అనేది మలయాళం సినిమా. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను రామ్‌చరణ్ దక్కించుకున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో వెంకటేశ్ హీరోగా నటించబోతున్నారని సమాచారం. ఇందుకోసం రామ్‌చరణ్ సంప్రదింపులు జరుపుతున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ రీమేక్ చిత్రాల్లో నటించిన క్రెడిట్ వెంకటేశ్‌కే దక్కుతుంది. గడచిన పదేళ్లల్లోనే ‘బాడీగార్డ్, మసాల, దృశ్యం, గోపాల గోపాల, గురు’ వంటి రీమేక్ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న ‘నారప్ప’ కూడా తమిళ చిత్రం ‘అసురున్’కి రీమేక్ కావడం విశేషం. మరి.. ‘డ్రైవింగ్ లెసెన్స్’తో వెంకీ రీమేక్ ఖాతాలో మరో సినిమా చేరుతుందా?
Comments
Please login to add a commentAdd a comment