produce
-
ఆహార పంటల విస్తీర్ణం పెరగాలి
సాక్షి, విశాఖపట్నం: నీటి కొరత పెరిగే కొద్దీ ప్రజల జీవన ప్రమాణాల్లో అనేక మార్పులు వస్తాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ గ్లోబల్ మిషన్ లీడర్ అమల్ తాల్బి తెలిపారు. ముఖ్యంగా ఆహార కొరత వేధిస్తుందని చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు తప్పవన్నారు. 2030 నాటికి 670 మిలియన్ల మంది ఆకలితో అలమటిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగణంగా ఆహార పంటల విస్తీర్ణాన్ని పెంచాల్సి ఉందన్నారు. 2050 నాటికి ప్రస్తుతం ఉన్న ఆహార ఉత్పత్తి రెట్టింపయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో 500 మిలియన్లకు పైగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల నుంచి 80 శాతం వరకూ ఆహారం ఉత్పత్తవుతోందని తెలిపారు. పేదరికాన్ని జయించేందుకు ప్రపంచ బ్యాంక్ అత్యంత కీలక నిర్ణయాలను అమలు చేస్తోందన్నారు. విశాఖపట్నంలో 25వ అంతర్జాతీయ కాంగ్రెస్, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 74వ అంతర్జాతీయ సమావేశాల్లో అమల్ తాల్బి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ‘సాక్షి’తో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నీటి ఎద్దడి పెరుగుతోంది.. గత 50 ఏళ్లలో వర్షపాతం గణనీయంగా 233 శాతం పెరిగింది. అయితే.. భూమికి చేరుతున్న వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాం. ఈ కారణంగానే నీటి ఎద్దడి పెరుగుతోంది. వాతావరణంలో తలెత్తుతున్న 10 మార్పుల్లో 8 నీటికి సంబంధించినవే ఉంటున్నాయి. దీన్నిబట్టి చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. సుస్థిర లక్ష్యాలు నిర్దేశించుకున్నాం.. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్ మిషన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా నీటి ఉత్పాదకత– సంరక్షణ, ఆహార ఉత్పత్తిని పెంపొందించడం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంక్ సుస్థిర లక్ష్యాల్ని నిర్దేశించుకుంది. ఫార్మర్ లెడ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ పేరుతో నీటిపారుదల రంగంలో స్థితిస్థాపకత, సాగునీటి నిర్వహణలో ఖచ్చితత్వం, నీటివనరుల అభివృద్ధి, మురుగు నీటి నిర్వహణ, వ్యవసాయంలో అత్యాధునిక పద్ధతులు, యాంత్రీకరణ తదితర అంశాలపై ఈ మిషన్ పనిచేస్తోంది. తొలి విడతలో ఆఫ్రికా దేశాల్లో 450 మిలియన్ యూఎస్ డాలర్లు ఖర్చు చేస్తున్నాం. ఈ మిషన్‌లో భాగంగా 77 మిలియన్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. అక్కడ విధానాల్లో అనేక మార్పుల్ని తీసుకొచ్చాం. భవిష్యత్తులో మిగిలిన దేశాల్లోనూ ప్రపంచ బ్యాంక్ మిషన్‌ని అమలు చేస్తాం. తద్వారా నీటి ఎద్దడి, ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాం. -
ఇజ్రాయెల్ ఆవుల ప్రత్యేకత ఏమిటి? పాలను ఏ పద్ధతిలో తీస్తారు?
ఇజ్రాయెల్ పలు అంశాలలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. వీటిలో ఒకటి ఆవుల పాల ఉత్పత్తి. పాల ఉత్పత్తిలో ఇజ్రాయెల్ ఆవులు ప్రపంచంలోనే ముందంజలో ఉన్నాయి. అవి గరిష్టంగా పాలను అందిస్తాయి. ఇందుకోసం ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. ఒక ఇజ్రాయెల్ ఆవు సంవత్సరానికి 12,000 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆవులు హోల్‌స్టెయిన్ జాతికి చెందినవి. ఆవులను ఉత్తమంగా సంరక్షించడంలో ప్రపంచంలోనే ఇజ్రాయెల్ ముందుంది. ఈ దేశంలో పాడి పరిశ్రమ నిర్వహణకు మంచి పేరుంది. రోజువారీ పాల దిగుబడి శాతాన్ని పరిశీలిస్తే, భారతీయ ఆవు 7.1 లీటర్లు, బ్రిటిష్ ఆవు 25.6, అమెరికన్ ఆవు 32.8, ఇజ్రాయెల్ ఆవు 38.7 లీటర్ల మొత్తంలో పాలు ఇస్తుంది. హెర్జ్లియా నగరాన్ని ఇజ్రాయెల్ పాల రాజధాని అని పిలుస్తారు. ఇజ్రాయెల్ అంతటా దాదాపు 1000 డైరీ ఫామ్‌లు ఉన్నాయి. 2016లో ఇజ్రాయెలీ డెయిరీ ఫామ్‌లు సుమారు 1,450 మిలియన్ లీటర్ల ఆవు పాలను ఉత్పత్తి చేశాయి. పాడి ఆవుల నిర్వహణకు దేశంలో ప్రత్యేక మేనేజ్మెంట్ కోర్సు ఉంది. ఇజ్రాయెల్‌లో ఆవు పాలను ఉపయోగించి 1000 కంటే ఎక్కువ విభిన్న పాల ఉత్పత్తులను తయారు చేస్తారు. 'మిక్వే ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ స్కూల్' 1880లో స్థాపితమయ్యింది. దేశంలో హోల్‌స్టెయిన్ జాతి ఆవు ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఇజ్రాయెలీ పాడి పరిశ్రమ విజయానికి అక్కడి సాంకేతిక పురోగతి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ రైతులు తమ ఆవులను సరైన ఉష్ణోగ్రతలో ఉంచడానికి శీతలీకరణ వ్యవస్థలను ఉపయోగిస్తారు. భారతదేశం నుండి పలు బృందాలు శిక్షణ కోసం ఇజ్రాయెల్ డెయిరీలకు కూడా వెళ్లాయి. ఇజ్రాయెల్ ప్రభావంతో భారత్‌తోపాటు చైనా, వియత్నాం, కెనడాలలో పాల ఉత్పత్తులు వృద్ధి చెందాయి. ఇజ్రాయెల్ డెయిరీలు చాలా వరకు సహకార సంస్థలు. ఇవి 20వ శతాబ్దం ప్రారంభంలో అభివృద్ధి చెందాయి. ఆవుల పాల ఉత్పత్తిలో వాటి పాలలో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ప్రమాణం ప్రకారం ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తాం. ఇజ్రాయెల్‌లోని అన్ని డెయిరీలు ఇజ్రాయెల్ డెయిరీ బోర్డ్ విధానాలను అనుసరిస్తాయి. రోబోటిక్ పద్ధతిలో ఆవుల నుండి పాలను తీస్తారు. ఈ రోబోటిక్ ప్రక్రియ 1999లో ఇక్కడ ప్రారంభమయ్యింది. ఇక్కడి ఆవులను పశువైద్యులు క్రమం తప్పకుండా పరీక్షిస్తుంటారు. ఇది కూడా చదవండి: అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు? -
2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి.. మహీంద్రా అండ్ మహీంద్రా లక్ష్యం
కేప్‌టౌన్ (దక్షిణాఫ్రికా): మహారాష్ట్రలోని చకాన్‌లో నెలకొల్పుతున్న ప్లాంటు నుంచి వార్షికంగా 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని సాధించాలని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నిర్దేశించుకుంది. 2027–29 మధ్య కాలంలో దీన్ని సాధించగలమని సంస్థ ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) వీజే నక్రా తెలిపారు. 2030 నాటికల్లా తమ మొత్తం వాహన విక్రయాల్లో 30 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. బీఈ శ్రేణిలో తొలి వాహనాన్ని వచ్చే ఏడాది ఆఖర్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతకన్నా 4–5 నెలల ముందు నుంచే చకాన్ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కాగలదని నక్రా వివరించారు. చకాన్‌లో రూ. 10,000 కోట్లతో విద్యుత్ వాహనాల ప్లాంటును నెలకొల్పేందుకు కంపెనీకి ఈ ఏడాది జనవరిలో అనుమతులు లభించాయి. బార్న్ ఎలక్ట్రిక్ (బీఈ) మోడల్స్ తయారీ కోసం ఈ ప్లాంటుపై వచ్చే 7–8 ఏళ్లలో కంపెనీ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఎక్స్‌యూవీ, కేవలం విద్యుత్ వాహనాల కోసమే ఉద్దేశించిన బీఈ బ్రాండ్ల కింద మొత్తం అయిదు ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్స్‌ను ప్రవేశపెట్టడంపై కంపెనీ కసరత్తు చేస్తోంది. -
తేనెటీగలే కాదు.. చీమలు కూడా తేనెను ఉత్పత్తి చేస్తాయని తెలుసా?
తేనె అనగానే మనకు గుర్తొచ్చేది తేనెటీగలే. అవి వివిధ రకాల పూల నుంచి మకరందాన్ని సేకరించి తేనెను ఉత్పత్తి చేస్తాయి. అందులోనూ కొన్నిరకాలే ఈ పనిచేస్తాయి. మరి వీటికి పూర్తి భిన్నంగా ఉండే ఒక రకం చీమలు కూడా తేనెను ఉత్పత్తి చేస్తాయి తెలుసా?.. ఈ చీమల తేనె, దాని సేకరణ, నిల్వ విధానం చాలా చిత్రంగా ఉంటుంది కూడా.. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. కరువులో వాడుకొనేందుకు.. సాధారణంగా చాలా రకాల జీవులు ఎప్పుడైనా ఆహారం దొరకని పరిస్థితుల్లో వాడుకొనేందుకు వీలుగా నిల్వ చేసుకుంటూ ఉంటాయి. అది అవి మామూలుగా తినే ఆహారమే అయి ఉంటుంది. కానీ ఆ్రస్టేలియా, అమెరికా, మెక్సికోతోపాటు పలు ఆఫ్రికా దేశాల్లోని ఎడారి భూముల్లో ఉండే ఒక రకం చీమలు ఏకంగా తేనెను నిల్వ చేసుకుంటాయి. అది కూడా చిత్రమైన పద్ధతిలో కావడం విశేషం. ఇవి కాంపోనోటస్ ఇన్ఫ్లాటస్ జాతికి చెందినవి. సింపుల్‌గా హనీపాట్ చీమలు అని పిలుస్తుంటారు. శరీరంలోనే ‘తేనె’నిల్వ ► సాధారణంగా తేనెటీగలు తమ నోటిద్వారా పూల నుంచి మకరందాన్ని సేకరించి.. దానిని ప్రత్యేకమైన పట్టుల్లో నిల్వచేస్తాయి. కానీ ఈ చీమలు తేనెను నిల్వ చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లేమీ ఉండవు. వాటి శరీరంలోనే తేనెను నిల్వ చేసుకుంటాయి. అందుకే వీటిని హనీపాట్ చీమలు అని పిలుస్తుంటారు. ► సాధారణంగా చీమల కాలనీల్లో వేర్వేరు విధులను వేర్వేరు చీమలు నిర్వహిస్తుంటాయి. ఇలా వర్కర్ చీమలు పూల నుంచి మకరందాన్ని సేకరించుకుని వచి్చ.. పుట్టలోనే ఉండే హనీపాట్ చీమల నోటికి అందిస్తాయి. హనీపాట్ చీమలు దానిని తేనెగా మార్చి తమ కడుపులో నిల్వ చేస్తాయి. ► ఈ నిల్వ ఏ స్థాయిలో ఉంటుందంటే.. హనీపాట్ చీమల కడుపు పగిలిపోతుందేమో అన్నంతగా తేనెను నింపుకొంటాయి. ఆ బరువుతో కదలలేక.. పుట్టలో గోడలను పట్టుకుని చాలా రోజులు అలాగే ఉండిపోతాయి. ► పుట్టలోని చీమలకు ఆహారం కొరత తలెత్తినప్పుడు.. ఈ హనీపాట్ చీమల కడుపు నుంచి తేనెను బయటికి తీసి తినేస్తాయి. ఒక్కోసారి ఇతర పుట్టల చీమలు.. హనీపాట్ చీమలున్న పుట్టపై దాడిచేసి తేనెను ఎత్తుకుపోతుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ చీమలు.. బహుమతులు సాధారణ తేనెతో పోలిస్తే ఈ చీమల తేనె తీపిదనం తక్కువని, కాస్త పుల్లటి రుచి కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చీమల తేనెలో గ్లూకోజ్ చక్కెర శాతం ఎక్కువని.. అదే తేనెటీగల తేనెలో ఫ్రక్టోజ్ రకం చక్కెర అధికమని వివరించారు. ఆ్రస్టేలియాలో స్థానిక తెగల ప్రజలు తేనెచీమలను సేకరించి బహుమతిగా ఇచ్చి పుచ్చుకుంటారట కూడా. చదవండి: మనసు మాట వినే చక్రాల కుర్చీ! -
భారత్‌లో స్పుత్నిక్ టీకా తయారీ మొదలు
న్యూఢిల్లీ: రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), భారత ఔషధ దిగ్గజం పనాసియా బయోటెక్‌లు స్పుత్నిక్–వి కోవిడ్ వ్యాక్సిన్ తయారీని భారత్‌లో ప్రారంభించాయి. ఈ మేరకు రెండు సంస్థలు సంయుక్తంగా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని బద్ది వద్ద ఉన్న పనాసియా బయోటెక్ తయారీకేంద్రం వద్ద వ్యాక్సిన్‌ను ఉత్పత్తిని మొదలుపెట్టినట్లు తెలిపాయి. వ్యాక్సిన్ తయారు చేశాక నాణ్యతను పరీక్షించేందుకు రష్యాలోని గమాలియా సెంటర్‌కు పంపిస్తామని తెలిపాయి. ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులను తయారు చేసేందుకు ఆర్డీఐఎఫ్, పనాసియాల మధ్య ఏప్రిల్‌లోనే ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించి వైరస్‌ను రూపుమాపడమే తమ లక్ష్యమని ఆర్డీఐఎఫ్ చీఫ్ క్రిమిల్ దిమిత్రివ్ చెప్పారు. భారత్‌లో స్పుత్నిక్ అత్యవసర వినియోగానికి గత నెలలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: కేరళ మంత్రుల్లో 60% మందిపై క్రిమినల్ కేసులు..13 మంది కోటీశ్వరులే ) -
వరికంకుల కొత్త చరిత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: విస్తారంగా వానలు.. నిండుకుండల్లా జలాశయాలు.. మత్తడి దుంకిన చెరువులు, కుంటలు.. పొలాలకు సమృద్ధిగా జలాలు.. భూమికి పచ్చాని రంగేసినట్టు పచ్చదనం... ఆకట్టుకున్న ప్రాజెక్టుల ఆయకట్టులు.. కాళేశ్వరం, దేవాదుల, శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టుల నీరు బిరబిరా కాల్వల్లో పరుగులు... ఫలితంగా రాష్ట్రంలో వరిసాగు రెండింతలైంది. వరికంకులు కొత్త చరిత్ర సృష్టించాయి. 2020– 21 యాసంగిలో మొత్తం పంటల అంచనా 36,43,770 ఎకరాలు కాగా, 68,14,555(187.02 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. వరిసాగు అంచనా 22,19,326 ఎకరాలు కాగా.. అనూహ్యంగా 52,78,636 (237.85 శాతం) ఎకరాల్లో సాగైంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు 1,47,80,181 టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని అంచనా. అయితే ఇప్పటికే రైసుమిల్లులు, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములు వానాకాలం ధాన్యంతో నిండిపోయాయి. ఈసారి యాసంగి పంట కొనుగోళ్లు సవాల్‌గా మారనున్నాయి. 137 శాతం అధికంగా వరిసాగు గత యాసంగి, ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి పంటలు దండిగా రానున్నాయి. అంచనాలకు మించి 137 శాతం అధికంగా వరి సాగైంది. ఒకదశలో ఈ యాసంగి ధాన్యం కోనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతుల్లో అలజడి చెలరేగడంతో మళ్లీ వెనుకడుగు వేసింది. యాసంగి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తాజాగా వెల్లడించారు. గతేడాది యాసంగిలో 38,62,510 ఎకరాల్లో వేస్తే ఈసారి 14,16126 ఎకరాల్లో అదనంగా సాగు చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలో సాగు అంచనా 43,710 ఎకరాలు కాగా, 1,19,682 ఎకరాల్లో వరివేశారు. నిజామాబాద్‌లో 1,92,616 ఎకరాలకుగాను 3,87,628, మహబూబ్‌నగర్ 29,415కుగాను 1,21,004, కరీంనగర్లో 1,21,853కుగాను 2,64,609, జగిత్యాలలో 1,32,648కుగాను 2,98,283, పెద్దపల్లిలో 1,13,520 ఎకరాలకుగాను 1,97,741 ఎకరాల్లో వరివేశారు. మొత్తంగా ఈ ఏడు 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గోదాములే సమస్య రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వరి విస్తీర్ణం 52.78 లక్షల ఎకరాలకు చేరిన నేపథ్యంలో 6,408 కొనుగోలు కేంద్రాలను 31 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 2,131 ఐకేపీ, 3,964 పీఏసీఎస్(ఫ్యాక్స్), 313 ఏఎంసీ, ఇతర కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయనున్నారు. ప్రస్తుత సీజన్‌కు కూడా కామన్ రకం క్వింటాకు రూ.1,868, ‘ఏ’గ్రేడ్ రకానికి చెందిన ధాన్యం క్వింటాకు రూ.1,888గా కనీసమద్దతు ధర(ఎంఎస్పీ) చెల్లిం చనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా వానాకాలం ధాన్యంతో రైసుమిల్లులు, గోదాములు నిండుకుండల్లా మార డం ప్రతిబంధకం కావచ్చని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కొత్తవి, పాతవి కలిపితే 21.99 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణవ్యాప్తంగా 2,210 రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి లక్షల టన్నుల బియ్యం తయారు చేస్తాయి. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కానీ, ఈసారి సగం మిల్లుల్లో వానాకాలం ధాన్యం, బియ్యం నిల్వలు ఫుల్‌గా ఉన్నాయి. వల్బాపూర్‌లో యంత్రంతో వరికోసిన తర్వాత ఆరబోసిన ధాన్యం ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు యాసంగిలో రైతులు అధికమొత్తంలో దొడ్డురకం వరిధాన్యం సాగు చేశారు. అక్కడక్కడ మాత్రమే సన్నరకం వరి వేశారు. ఈ యాసంగిలో వరి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని గుర్తించాం. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కసరత్తు పూర్తయింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేసి మిల్లులకు తరలించేందుకు అనుమతుల కోసం లేఖ రాశాం. – రాఘవేందర్, డీఎం, జయశంకర్ భూపాలపల్లి ఈసారి కొంత ఎక్కువ దిగుబడి పోయినసారి కన్నా ఈసారి కొంత ఎక్కువ దిగుబడి వచ్చింది. పోయిన యాసంగిల ఎకరానికి 23 క్వింటాళ్లు వస్తే, పోయిన వానాకాలంల కేవలం 18 క్వింటాళ్లే వచ్చాయి. ఈసారి అధికారులు 28 అంటున్రుగాని సుమారు 26 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. – ఎండపెల్లి శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, కమలాపూర్, వరంగల్ అర్బన్ జిల్లా ఇప్పటికైతే మంచిగానే ఉంది ఎన్నో ఏళ్లుగా ఎవుసాన్ని నమ్ముకొని బతుకుతున్న. మూడు, నాలుగేళ్లుగా ఎవుసం చేస్తె అప్పులే తప్ప గవ్వ మిగులలేదు. వానాకాలం పంట చేతికి వచ్చే సమయానికి వాన నిండా ముంచింది. యాసంగి పంట దిగుబడి ఇప్పటికైతే మంచిగానే ఉంది. కోసే దాక వానలు కొట్టకపోతే ఎకరానికి 25 క్వింటాళ్ల దాక వడ్లు చేతికి వస్తయ్. – డొంగరి రాజయ్య, రైతు, కాటారం, జేఎస్ భూపాలపల్లి జిల్లా 2020–21 యాసంగి సాగు వివరాలు (ఎకరాల్లో) యాసంగిలో మొత్తం పంటల అంచనా 36,43,770 ఈ ఏడాది యాసంగి సాగు 68,14,555 మొత్తంగా సాగు శాతం 187.02 గతేడాది యాసంగి సాగు 52,22,377 అత్యధికంగా పంటలు సాగైన జిల్లా వరంగల్ రూరల్ (299.10 శాతం) అత్యల్పంగా పంటలు సాగైన జిల్లా ఆసిఫాబాద్ కొమురం భీం (128.95 శాతం) రాష్ట్రంలో వరిసాగు అంచనా(ఎకరాల్లో) 22,19,326 ఈ యాసంగి సాగు 52,78,636 మొత్తంగా వరిసాగు శాతం 237.85 దిగుబడి అంచనా 1,47,80,181(దొడ్డు రకం 1.19 కోట్ల టన్నులు + టన్నులు సన్నాలు 28.80 లక్షల టన్నులు) గతేడాది సాగు 38,62,510 యాసంగి కొనుగోళ్లు ఇలా మొత్తం కొనుగోలు కేంద్రాలు 6,408 ఐకేపీ కేంద్రాలు 2,131 పీఏసీఎస్ (ఫ్యాక్స్) కేంద్రాలు 3,964 ఏఎంసీ, ఇతర కేంద్రాలు 313 కనీస మద్దతుధర (ఎంఎస్పీ) ‘ఏ’గ్రేడ్ (క్వింటాకు) రూ.1,888 కామన్ రకం (క్వింటాకు) రూ.1,868 చదవండి:త్వరలో రంగారెడ్డి జిల్లాలోని అసైన్డ్ భూముల వేలం -
వెంకీ డ్రైవింగ్ లైసెన్స్?
వెంకటేశ్‌కు రామ్‌చరణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఇవ్వాలనుకుంటున్నారట. విచిత్రంగా ఉంది కదూ.. ‘డ్రైవింగ్ లెసెన్స్’ అనేది మలయాళం సినిమా. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను రామ్‌చరణ్ దక్కించుకున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో వెంకటేశ్ హీరోగా నటించబోతున్నారని సమాచారం. ఇందుకోసం రామ్‌చరణ్ సంప్రదింపులు జరుపుతున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ రీమేక్ చిత్రాల్లో నటించిన క్రెడిట్ వెంకటేశ్‌కే దక్కుతుంది. గడచిన పదేళ్లల్లోనే ‘బాడీగార్డ్, మసాల, దృశ్యం, గోపాల గోపాల, గురు’ వంటి రీమేక్ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న ‘నారప్ప’ కూడా తమిళ చిత్రం ‘అసురున్’కి రీమేక్ కావడం విశేషం. మరి.. ‘డ్రైవింగ్ లెసెన్స్’తో వెంకీ రీమేక్ ఖాతాలో మరో సినిమా చేరుతుందా? -
అన్ని సమస్యలూ ఎదుర్కొన్నా
‘‘ఒక కొత్త నిర్మాత ఎదుర్కొన్న అన్ని సమస్యలను నేనూ ఎదుర్కొన్నాను. వీటన్నింటినీ ఒక లెర్నింగ్ ప్రాసెస్‌గా భావించాను. అందరికీ వినోదం కావాలి. కానీ చాలామందికి సినిమాలంటే చిన్నచూపు’’ అన్నారు నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిశోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మాది అనంతపురం. ఇంజినీరింగ్ పూర్తి చేశాను. కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేశాను. సినిమాలపై ఆసక్తితో నిర్మాణరంగంలోకి వచ్చాను. చిన్నతనం నుంచే నిర్మాణరంగంపై ఆసక్తి ఉంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు గారు నాకు ప్రేరణ. సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా చేశా. లాభ నష్టాలను చూశాను. ఈ అనుభవంతో ఒక సినిమాను నిర్మించాలనుకుని ఈ సినిమా చేశాను. ముందు మూడున్నర కోట్ల బడ్జెట్ అనుకున్నాం. కానీ దాదాపు ఆరుకోట్లు అయ్యింది. అయితే అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రాయ్ లక్ష్మీకి మంచి క్రేజ్ ఉంది. అందరికీ నచ్చేలా ఉంటుంది ఈ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా మంచి ఎమోషన్ కూడా ఉంది. టీమ్ అందరూ బాగా సహకరించారు. హీరో హీరోయిన్లు బాగా నటించారు. మధునందన్, ప్రవీణ్‌ల పాత్రలు నవ్విస్తాయి. మరో నాలుగు ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. -
‘హిందువులు పిల్లల్ని కంటూనే ఉండండి’
లక్నో : హిందువులు పిల్లలను కంటూనే ఉండాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ఖతౌలీ నియోజకవర్గంకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఎమ్మెల్యే జనాభా నియంత్రణపై ముజుఫర్ నగర్లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. జనాభా నియంత్రణకు ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చేంత వరకు హిందూ సోదరులు పిల్లలు కంటూనే ఉండాలని పిలుపునిచ్చారు. ‘ఇద్దరు పిల్లలు ముద్దు’ మనకు సమ్మతమే కానీ ఇతరులు దానిని పాటించడం లేదన్నారు. చట్టం అందరికీ సమానేమనని, ఈ దేశం ప్రతి ఒక్కరిదని, హిందువులు పిల్లల్ని కనడం ఆపొద్దని సూచించారు. ఇద్దరు పిల్లలున్నారు కదా.. మూడో బిడ్డ ఎందుకని తన భార్య అడిగిందని, కానీ నలుగురైదుగురు పిల్లలు కావాలని ఆమెకు చెప్పానని సైనీ తెలిపారు. ఇక సైనీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. హిందూస్థాన్ హిందువులది.. ముస్లింలు పాకిస్థాన్‌కు వెళ్లిపోండంటూ గత నెలలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక నూతన సంవత్సర వేడుకలు, వాలంటైన్స్ డే క్రైస్తవుల పండుగ అని, దానిని హిందువులు చేసుకోరాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో దుమారం రేగింది. ఇక గోవులను చంపారని కొందరిపై దాడి చేసిన ఘటనలో ఈయనపై కేసులు కూడా నమోదయ్యాయి. -
సల్మాన్ హీరో..చరణ్ ప్రొడ్యూసర్
-
బాబాయ్ నిర్మాతగా అబ్బాయ్ హీరోగా సినిమా
-
నిర్మాతగా...
‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో కెరీర్ ఆరంభించి, వరుసగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు ముంబయ్ బ్యూటీ ఫ్రీదా పింటో. గత ఆరేడేళ్లల్లో దాదాపు పదిహేను హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఫ్రీదాకి నిర్మాతగా మారాలనే కోరిక కలిగింది. నటిగా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, నిర్మాతగా మాత్రం శక్తిమంతమైన సందేశంతో కూడిన చిత్రాలను నిర్మించాలనుకుంటున్నారామె. ఇప్పటికే రెండు చిత్రాలకు సన్నాహాలు మొదలుపెట్టారు. అవి రెండూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలే కావడం విశేషం. వచ్చే ఏడాది మార్చిలో తొలి చిత్రాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ ఫ్రీదానే నటిస్తారా లేక వేరే తారలను ఎంపిక చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఆంగ్ల భాషలో రూపొందించనున్న ఈ చిత్రాలను విదేశాల్లోనే కాదు.. భారతదేశంలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. -
కృత్రిమ పాలు విక్రయిస్తే జైలుకే...
మంత్రి జయచంద్ర హెచ్చరిక సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కృత్రిమ పాలను ఉత్పత్తి చేసే వారికి జైలు శిక్ష విధించడానికి చట్టాన్ని తీసుకు రానున్నట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర తెలిపారు. దీనికి సంబంధించిన ముసాయిదాకు తుది రూపునిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ గుండె దినం సందర్భంగా కర్ణాటక పాడి సమాఖ్య (కేఎంఎఫ్) సోమవారం నగరంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులను సత్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ.... రాష్ట్ర సరిహద్దుల్లో రసాయనాలతో కూడిన పాలను తయారు చేసి, అమ్ముతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఇలాంటి కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఆరోగ్య, పశు సంవర్ధక శాఖలు సంయుక్తంగా నియంత్రించాల్సి ఉందన్నారు. దీనిపై కార్యాచారణ చేపట్టినప్పటికీ పూర్తిగా నియంత్రించడానికి సాధ్యం కావడం లేదన్నారు. ఇలాంటి కృత్రిమ పాలను ఉత్పత్తి చేస్తున్న వారిని జైలుకు పంపాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. కాగా శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం కనుక, దీనిపై కేఎంఎఫ్ అవగాహన కల్పిస్తోందన్నారు. పుట్టిన మూడు నెలలకే గుండె జబ్బులు వస్తుండడం ఆందోళనకరమైన పరిణామమని పేర్కొన్నారు. రాష్ర్టంలో వైద్యుల కొరత ఉందని, వారిని గౌరవప్రదంగా చూసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తరచూ దాడులు జరుగుతుండడంతో గ్రామాలకు వెళ్లడానికి వైద్యులు జంకుతున్నారని ఆయన తెలిపారు. కాగా జయదేవ గుండె ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ సీఎన్. మంజునాథ్ సన్మానం అందుకుని మాట్లాడుతూ ఇటీవల విటమిన్ డీ కొరత ఎక్కువగా కనిపిస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు పాలలో ఆ విటమిన్‌ను కలపాల్సిందిగా కేఎంఎఫ్‌కు సూచించారని చెప్పారు. దీంతో ఏ, డీ విటమిన్లను అందులో కలుపుతున్నారని వెల్లడించారు. డీ విటమిన్ కొరత వల్ల గుండె సంబంధ రోగాలు ఎక్కువయ్యాయని చెప్పారు. ఇటీవల మూడు వేల మందికి పరీక్షలు నిర్వహించగా, 70 నుంచి 75 శాతం మందికి డీ విటమిన్ లోపించినట్లు వెల్లడైందని ఆయన తెలిపారు. సన్మానాన్ని అందుకున్న వారిలో మల్య ఆస్పత్రికి చెందిన డాక్టర్ వీకే. శ్రీనివాస్, డాక్టర్ హెచ్ఎస్. శ్రీకంఠ ఉన్నారు.