
బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ
లక్నో : హిందువులు పిల్లలను కంటూనే ఉండాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ఖతౌలీ నియోజకవర్గంకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఎమ్మెల్యే జనాభా నియంత్రణపై ముజుఫర్ నగర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. జనాభా నియంత్రణకు ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చేంత వరకు హిందూ సోదరులు పిల్లలు కంటూనే ఉండాలని పిలుపునిచ్చారు. ‘ఇద్దరు పిల్లలు ముద్దు’ మనకు సమ్మతమే కానీ ఇతరులు దానిని పాటించడం లేదన్నారు. చట్టం అందరికీ సమానేమనని, ఈ దేశం ప్రతి ఒక్కరిదని, హిందువులు పిల్లల్ని కనడం ఆపొద్దని సూచించారు. ఇద్దరు పిల్లలున్నారు కదా.. మూడో బిడ్డ ఎందుకని తన భార్య అడిగిందని, కానీ నలుగురైదుగురు పిల్లలు కావాలని ఆమెకు చెప్పానని సైనీ తెలిపారు.
ఇక సైనీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. హిందూస్థాన్ హిందువులది.. ముస్లింలు పాకిస్థాన్‌కు వెళ్లిపోండంటూ గత నెలలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక నూతన సంవత్సర వేడుకలు, వాలంటైన్స్ డే క్రైస్తవుల పండుగ అని, దానిని హిందువులు చేసుకోరాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో దుమారం రేగింది. ఇక గోవులను చంపారని కొందరిపై దాడి చేసిన ఘటనలో ఈయనపై కేసులు కూడా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment