ఇజ్రాయెల్ పలు అంశాలలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. వీటిలో ఒకటి ఆవుల పాల ఉత్పత్తి. పాల ఉత్పత్తిలో ఇజ్రాయెల్ ఆవులు ప్రపంచంలోనే ముందంజలో ఉన్నాయి. అవి గరిష్టంగా పాలను అందిస్తాయి. ఇందుకోసం ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది.
ఒక ఇజ్రాయెల్ ఆవు సంవత్సరానికి 12,000 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆవులు హోల్‌స్టెయిన్ జాతికి చెందినవి. ఆవులను ఉత్తమంగా సంరక్షించడంలో ప్రపంచంలోనే ఇజ్రాయెల్ ముందుంది. ఈ దేశంలో పాడి పరిశ్రమ నిర్వహణకు మంచి పేరుంది. రోజువారీ పాల దిగుబడి శాతాన్ని పరిశీలిస్తే, భారతీయ ఆవు 7.1 లీటర్లు, బ్రిటిష్ ఆవు 25.6, అమెరికన్ ఆవు 32.8, ఇజ్రాయెల్ ఆవు 38.7 లీటర్ల మొత్తంలో పాలు ఇస్తుంది.
హెర్జ్లియా నగరాన్ని ఇజ్రాయెల్ పాల రాజధాని అని పిలుస్తారు. ఇజ్రాయెల్ అంతటా దాదాపు 1000 డైరీ ఫామ్‌లు ఉన్నాయి. 2016లో ఇజ్రాయెలీ డెయిరీ ఫామ్‌లు సుమారు 1,450 మిలియన్ లీటర్ల ఆవు పాలను ఉత్పత్తి చేశాయి. పాడి ఆవుల నిర్వహణకు దేశంలో ప్రత్యేక మేనేజ్‌మెంట్ కోర్సు ఉంది. ఇజ్రాయెల్‌లో ఆవు పాలను ఉపయోగించి 1000 కంటే ఎక్కువ విభిన్న పాల ఉత్పత్తులను తయారు చేస్తారు.
'మిక్వే ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ స్కూల్' 1880లో స్థాపితమయ్యింది. దేశంలో హోల్‌స్టెయిన్ జాతి ఆవు ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఇజ్రాయెలీ పాడి పరిశ్రమ విజయానికి అక్కడి సాంకేతిక పురోగతి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ రైతులు తమ ఆవులను సరైన ఉష్ణోగ్రతలో ఉంచడానికి శీతలీకరణ వ్యవస్థలను ఉపయోగిస్తారు. భారతదేశం నుండి పలు బృందాలు శిక్షణ కోసం ఇజ్రాయెల్ డెయిరీలకు కూడా వెళ్లాయి. ఇజ్రాయెల్ ప్రభావంతో భారత్‌తోపాటు చైనా, వియత్నాం, కెనడాలలో పాల ఉత్పత్తులు వృద్ధి చెందాయి.
ఇజ్రాయెల్ డెయిరీలు చాలా వరకు సహకార సంస్థలు. ఇవి 20వ శతాబ్దం ప్రారంభంలో అభివృద్ధి చెందాయి. ఆవుల పాల ఉత్పత్తిలో వాటి పాలలో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ప్రమాణం ప్రకారం ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తాం. ఇజ్రాయెల్‌లోని అన్ని డెయిరీలు ఇజ్రాయెల్ డెయిరీ బోర్డ్ విధానాలను అనుసరిస్తాయి. రోబోటిక్ పద్ధతిలో ఆవుల నుండి పాలను తీస్తారు. ఈ రోబోటిక్ ప్రక్రియ 1999లో ఇక్కడ ప్రారంభమయ్యింది. ఇక్కడి ఆవులను పశువైద్యులు క్రమం తప్పకుండా పరీక్షిస్తుంటారు.
ఇది కూడా చదవండి: అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు?
Comments
Please login to add a commentAdd a comment