
టెల్‌అవీవ్: ఇరాన్ మిసైల్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులను అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. దాడుల నేపథ్యంలో భారతపౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించింది.
ఇజ్రాయెల్ అధికార యంత్రాంగం సూచించించిన భద్రతా చర్యలన్నీ పాటించాలని కోరింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. మరోపక్క లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపుపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేయడంతో అక్కడ నివసిస్తున్న పౌరులకు కూడా ఇటీవల భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ దాడులు
Comments
Please login to add a commentAdd a comment