పేజర్‌ దాడులు నిజంగా ఇజ్రాయెల్‌ పనేనా? | Israeli Envoy In India Reacts On Lebanon Pagers Row Criticism, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

పేజర్‌ దాడులు నిజంగా ఇజ్రాయెల్‌ పనేనా?.. భారత్‌లో ఆ దేశ రాయబారి రియాక్షన్‌ ఇదే..

Published Wed, Sep 25 2024 8:03 AM | Last Updated on Wed, Sep 25 2024 8:22 AM

Israeli Envoy In India Reacts On Lebanon Pagers Row Criticism

లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడులతో సాధారణ పౌరులు కూడా మరణిస్తున్నారని లెబనాన్‌ ఆరోపిస్తోంది. అయితే.. ప్రస్తుతకాలంలో ప్రపంచంలోని మరేయితర దేశం ఎదుర్కొనంత యుద్ధ సంక్షోభం తాము ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్‌ చెప్పుకుంటోంది. 

ఒకవైపు హమాస్‌.. మరోవైపు హెజ్‌బొల్లా దాడులతో క్లిష్టమైన పరిస్థితుల్లో తాము ఉన్నట్లు చెబుతోంది. అదే సమయంలో.. ప్రత్యర్థులపై చేస్తున్న జరుగుతున్న ‘మిస్టరీ  దాడుల్ని’ తోసిపుచ్చకపోవడం గమనార్హం!!. అయితే.. భారత్‌లో ఆ దేశ రాయబారి రూవెన్ అజార్ ఓ జాతీయ మీడియా ఛానెల్‌ డిబేట్‌లో పాల్గొన్నారు. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లకు సంబంధించిన ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఇది ఇజ్రాయెల్‌, దాని నిఘా సంస్థల పనేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా అని యాంకర్‌ అడిగింది. దానికి ఆయన స్పందిస్తూ..

‘‘గతంలో సైన్యాల మీదనో, ఉగ్రవాదం మీదనో దాడులు జరిగేవి.  ప్రస్తుతం యుద్ధం అనేది సంప్రదాయ పద్ధతుల నుంచి హైబ్రీడ్‌ పద్ధతికి మారిపోయింది. ఈ కాలంలో ఇజ్రాయెల్‌ ఎదుర్కొన్నంత దాడులు మరేయితర దేశం ఎదుర్కొలేదు. రాకెట్లు, మిస్సైల్స్‌ మాత్రమే కాదు.. మా దేశంపై సైబర్‌ దాడులు కూడా జరిగాయి. నింగి, నేల, జల మార్గం ఆఖరికి టన్నెల్స్‌ ద్వారా కూడా మాపై దాడులు జరిగాయి.

.. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇజ్రాయెల్‌ కేవలం తనను తాను రక్షించుకోవడం మీద మాత్రమే ఫోకస్‌ చేయడం లేదు. అదే టైంలో తన దాడులతో శత్రు దేశాలకు ‘సర్‌ప్రైజ్‌’ చేయాలనుకుంటోంది కూడా. ఇజ్రాయెల్‌ ఇప్పుడు ఏ తరహా దాడులు చేస్తుందో.. అనే అంశం లోతుల్లోకి నేను వెళ్లాలనుకోవడం లేదు. కానీ, ప్రత్యర్థులు దొడ్డిదారిన దాడులకు తెగబడినప్పుడు వాళ్లకు అదే రీతిలో బదులివ్వడం తప్పేం కాదు కదా’’ అని రూవెన్‌ వ్యాఖ్యానించారు.

ఇదే ఇంటర్వ్యూలో ఆయన.. తాజా యుద్ధ పరిణామాలతో పాటు అమెరికా, భారత్‌ నుంచి ఇజ్రాయెల్‌కు దక్కిన మద్ధతు, తాజా అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, పాలస్తీనా అధ్యక్షుడు ముహమ్మద్‌ అబ్బాస్‌తో భేటీ కావడం లాంటి అంశాలపైనా స్పందించారు. 

లెబనాన్‌లో సెప్టెంబర్‌ 17-18 తేదీల మధ్య పేజర్లు, ఆ మరుసటి రోజే వాకీటాకీలు.. ఇతర శాటిలైట్‌ డివైజ్‌లు పేలిపోయి 37 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. ఇవి హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌.. దాని నిఘా సంస్థ మోస్సాద్‌ జరిపిన దాడులేనని లెబనాన్‌ ఆరోపిస్తూ వస్తోంది. 

ఇదీ చదవండి: మెరుపు దాడి.. హెజ్‌బొల్లాకు కోలుకోలేని దెబ్బ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement