దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతున్న కాల్పుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ మిషన్‌లో 600 మంది భారతీయ సైనికులు ఉన్నారు. వీరంతా ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో 120 కిలో మీటర్ల బ్లూ లైన్ వెంబడి ఉన్నారు. దీంతో అక్కడి ఉన్న భారత్ సైనిక భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారత్ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘ బ్లూ లైన్ వెంబడి భద్రతా పరిస్థిలు వేగంగా క్షీణించటంపై మేం ఆందోళన చెందుతున్నాం. అక్కడ నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉన్నాం. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రాంతాల్లో దాడుల ఉల్లంఘనకు పాల్పడవద్దు. యూఎన్ శాంతి పరిరక్షకుల భద్రత కోసం అక్కడ తగిన చర్యలు తీసుకోవాలి’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యం యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న అబ్జర్వేషన్ టవర్‌పై దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇద్దరు యూఎన్ శాంతి పరిరక్షకులు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో పేర్కొంది.‘‘ అదృష్టవశాత్తూ ఇద్దరు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. వారు చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్నారని తెలిపింది.
హిజ్బుల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితి పెరిగింది. ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రాంతంలో దాడులు చేయటతో అక్కడే ఉన్న యూఎన్ శాంతి పరిరక్షకులకు ప్రమాదకరంగా మారింది.అయితే.. యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్ సైనికుల పోస్టులకు సమీపంలో హెజ్‌బొల్లా బలగాలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆరోపణలు చేస్తోంది.
చదవండి: ట్రంప్‌పై ఒబామా విమర్శలు.. అమెరికాకు కమలా హారిస్ కావాలి
Comments
Please login to add a commentAdd a comment