నిర్మాతగా... | Freida Pinto to produce two English films | Sakshi

నిర్మాతగా...

Dec 7 2014 10:54 PM | Updated on Sep 2 2017 5:47 PM

నిర్మాతగా...

నిర్మాతగా...

‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో కెరీర్ ఆరంభించి, వరుసగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు ముంబయ్ బ్యూటీ ఫ్రీదా పింటో. గత ఆరేడేళ్లల్లో దాదాపు పదిహేను హాలీవుడ్

 ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో కెరీర్ ఆరంభించి, వరుసగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు ముంబయ్ బ్యూటీ ఫ్రీదా పింటో. గత ఆరేడేళ్లల్లో దాదాపు పదిహేను హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఫ్రీదాకి నిర్మాతగా మారాలనే కోరిక కలిగింది. నటిగా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, నిర్మాతగా మాత్రం శక్తిమంతమైన సందేశంతో కూడిన చిత్రాలను నిర్మించాలనుకుంటున్నారామె. ఇప్పటికే రెండు చిత్రాలకు సన్నాహాలు మొదలుపెట్టారు. అవి రెండూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలే కావడం విశేషం. వచ్చే ఏడాది మార్చిలో తొలి చిత్రాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ ఫ్రీదానే నటిస్తారా లేక వేరే తారలను ఎంపిక చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఆంగ్ల భాషలో రూపొందించనున్న ఈ చిత్రాలను విదేశాల్లోనే కాదు.. భారతదేశంలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement