చేసి చూపిస్తా! | We Do It Together is way to tackle gender gap: Freida Pinto | Sakshi
Sakshi News home page

చేసి చూపిస్తా!

Published Tue, May 17 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

చేసి చూపిస్తా!

చేసి చూపిస్తా!

 భారతీయ అందాల తారలు ఐశ్వర్యారాయ్, సోనమ్‌కపూర్, మల్లికా శెరావత్‌లు ఇప్పటికే కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మెరిసిన విషయం తెలిసిందే. సోమవారం ఫ్రిదా పింటో కూడా సందడి చేశారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా మారిపోయి, ఇప్పుడు హాలీవుడ్ చిత్రాలతో బిజీ అయిపోయారు ఫ్రిదా.
 
 తాజాగా ఆమె నిర్మాతగా కూడా  మారనున్న సంగతి తెలిసిందే. ‘వియ్ డూ ఇట్ టుగెదర్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, మహిళల కోసం సినిమాలు తీయనున్నారు. జెస్సికా , జూలియట్ బినోచి, క్వీన్ లతీఫా, క్యాథరిన్ హార్డ్ వికే వంటి ప్రముఖ హాలీవుడ్ తారలతో కలిసి ఈ  సంస్థను ప్రారంభించిన ఫ్రిదా దీని ప్రచారం కోసమే కాన్స్ చలనచిత్రోత్సవాలకు వెళ్లారు.  ‘‘మహిళా సాధికారతను ప్రతిబింబించే బుల్లితెర రియాలిటీ షోలే కాకుండా సినిమాలు కూడా తీస్తాం.
 
 హాలీవుడ్, బాలీవుడ్‌లలో పురుషులు, మహిళల పారితోషికాల్లో వ్యత్యాసం ఉంది. దీనిలో  మార్పు రావాల్సి ఉంది. అయినా మేం మాటలు చెప్పేవాళ్లం కాదు... చేతల్లో చూపించే వాళ్లం. అందుకే మా సంస్థకు ట్యాగ్‌లైన్ ‘డూయర్ నాట్ ఎ టాకర్’ అని పెట్టాం. మహిళల కోసం మహిళ లు తీసే ఈ  సినిమాలను అందరూ ఎంజాయ్ చేయొచ్చు’’ అని ఫ్రిదా చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement