
'స్లమ్‌డాగ్ మిలియనీర్'తో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఫ్రిదా పింటో త్వరలో తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. త్వరలోనే బుల్లి ట్రాన్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రియుడు కోరీ ట్రాన్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా కోరీ ట్రాన్, ఫ్రిదా పింటో 2017 నుంచి డేటింగ్ చేసుకుంటున్నారు. వీరి ప్రేమను పెళ్లి పీటలెక్కించాలనుకున్న ఈ లవ్ బర్డ్స్ 2019లో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ పెళ్లి డేట్ మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆమె గర్భవతినన్న విషయాన్ని చెప్పడంతో సెలబ్రిటీలు, అభిమానులు ఫ్రిదాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఫ్రిదా కెరీర్ విషయానికి వస్తే ఆమె 'స్లమ్‌డాగ్ మిలియనీర్', 'ఇమ్మోర్టల్స్', 'రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్' వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె 'బ్రిటన్స్ వరల్డ్ వార్ 2' తోపాటు 'స్పై ప్రిన్సెస్: ద లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్' చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. 'స్పై ప్రినెన్స్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.
చదవండి: ఈ పాపులర్ హీరోను గుర్తు పట్టారా?.. ఎందుకిలా అయ్యాడంటే..
Comments
Please login to add a commentAdd a comment