Frida Pinto
-
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న హీరోయిన్!
'స్లమ్‌డాగ్ మిలియనీర్'తో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఫ్రిదా పింటో త్వరలో తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. త్వరలోనే బుల్లి ట్రాన్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రియుడు కోరీ ట్రాన్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా కోరీ ట్రాన్, ఫ్రిదా పింటో 2017 నుంచి డేటింగ్ చేసుకుంటున్నారు. వీరి ప్రేమను పెళ్లి పీటలెక్కించాలనుకున్న ఈ లవ్ బర్డ్స్ 2019లో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ పెళ్లి డేట్ మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆమె గర్భవతినన్న విషయాన్ని చెప్పడంతో సెలబ్రిటీలు, అభిమానులు ఫ్రిదాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఫ్రిదా కెరీర్ విషయానికి వస్తే ఆమె 'స్లమ్‌డాగ్ మిలియనీర్', 'ఇమ్మోర్టల్స్', 'రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్' వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె 'బ్రిటన్స్ వరల్డ్ వార్ 2' తోపాటు 'స్పై ప్రిన్సెస్: ద లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్' చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. 'స్పై ప్రినెన్స్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Freida Pinto (@freidapinto) చదవండి: ఈ పాపులర్ హీరోను గుర్తు పట్టారా?.. ఎందుకిలా అయ్యాడంటే.. అవెంజర్స్ ఎలిజబెత్‌కు పెళ్లైందా? -
ఆ అమ్మాయే ఈ అమ్మాయి
స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో లతిక అనే అమ్మాయి ఉంటుంది. పెద్దయ్యాక ఆ అమ్మాయి హీరోయిన్ ఫ్రిదా పింటో. చిన్నప్పుడు రుబీనా అలి. టీనేజ్‌లో తన్వీ గణేశ్. సినిమాలో తన్వీ స్లమ్ ఏరియాలో ఉంటుంది. స్లమ్ గర్ల్‌లా ఉంటుంది. యాక్షన్ అద్భుతంగా ఉందని, వయసును మించిన అభినయాన్ని ప్రదర్శించిందని ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ ‘స్లమ్ గర్ల్’ తన్వీ రియల్ లైఫ్ ఫొటో ఇది. తన్వీకి ఇప్పుడు 21 ఏళ్లు. యు.ఎస్.లో ఉంటోంది. సినిమాల్లో ట్రై చేస్తోంది. తను ఆర్టిస్ట్ కూడా. మంచి మంచి పెయింటింగ్స్ వేస్తోంది. ఇండియన్ డెరైక్టర్ ఎవరైనా సినిమా తీస్తే మళ్లీ మనం లతికను మనసుదోచే పాత్రలో చూడొచ్చు. -
ఇప్పటికీ స్నేహితుడే..!
గాఢాతి గాఢంగా ప్రేమించుకుని కూడా చివరకు ఏదో ఒక కారణంతో విడిపోయేవాళ్లు మనలో చాలా మందే ఉంటారు. ఇక సెలబ్రిటీలకైతే ఇవన్నీ సర్వసాధారణం. వాళ్లకు ప్రేమలో పడటం ఎంత తేలికో...విడిపోవడం కూడా అంతే. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఫ్రిదా పింటో, దేవ్ పటేల్ ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆరేళ్ల నుంచి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరూ తమ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ-‘‘జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటికి దూరంగా పారిపోవడం పరిష్కారం కాదు. కానీ ఇప్పటికీ దేవ్ నాకు మంచి స్నేహితుడే. తను చాలా మంచి వ్యక్తి, నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అతనొకరు’’ అని చెప్పారు.