ఇప్పటికీ స్నేహితుడే..! | Still he is a friend! | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ స్నేహితుడే..!

Published Sat, Apr 11 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

ఇప్పటికీ  స్నేహితుడే..!

ఇప్పటికీ స్నేహితుడే..!

గాఢాతి గాఢంగా  ప్రేమించుకుని కూడా చివరకు  ఏదో ఒక కారణంతో  విడిపోయేవాళ్లు మనలో చాలా మందే ఉంటారు. ఇక సెలబ్రిటీలకైతే  ఇవన్నీ సర్వసాధారణం. వాళ్లకు  ప్రేమలో పడటం ఎంత తేలికో...విడిపోవడం కూడా అంతే.  ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఫ్రిదా పింటో, దేవ్ పటేల్ ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ప్రేమలో పడ్డారు.

ఆరేళ్ల నుంచి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరూ తమ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ-‘‘జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటికి దూరంగా పారిపోవడం పరిష్కారం కాదు. కానీ ఇప్పటికీ దేవ్ నాకు  మంచి స్నేహితుడే. తను చాలా మంచి వ్యక్తి, నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అతనొకరు’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement