Dev Patel
-
Monkey Man In OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ హాలీవుడ్ చిత్రం.. గత నెలలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. కావాల్సింది. కానీ సెన్సార్ ఇబ్బందుల వల్ల భారత్ తప్ప అన్నిచోట్ల కూడా విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. మనోళ్లు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తుండగా.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విషయం సర్ప్రైజ్ చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు ఉంది. 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దేవ్ పటేల్.. ఆ తర్వాత హాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇతడే 'మంకీ మ్యాన్' మూవీతో దర్శకుడిగానూ మారాడు. ఇందులో హీరోగానూ చేశాడు. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ మూవీని పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తీశాడు. ఫైట్స్ లాంటివి ఇష్టపడే ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చూడొచ్చు. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) ఇకపోతే సెన్సార్ ఇబ్బందుల వల్ల 'మంకీ మ్యాన్' మూవీ మన దేశంలో రిలీజ్ కాలేదు. ఇంకెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్న టైంలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే భారతీయ ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతానికైతే రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. 'మంకీ మ్యాన్' కథ విషయానికొస్తే.. ముంబైని పోలినట్లు యాతనా అనే సిటీ ఉంటుంది. ఇక్కడ ఉండే హీరో.. రాత్రిపూట కోతి మాస్క్ వేసుకుని మల్లయుద్ధ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. ఇతడికి ప్రత్యేకంగా పేరేం ఉండదు. ఇతడు.. ఓ అమ్మాయిని వ్యభిచారం నుంచి రక్షించేందుకు క్రూరుడైన పోలీస్ అధికారిని ఎదుర్కొంటాడు. హీరోకి పోలీస్ ఆఫీసర్‌కి గతంలో ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఇందులో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కూడా నటించింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ రెండు కాస్త స్పెషల్) -
హాలీవుడ్‌కు తెలుగమ్మాయి హాయ్
తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ హాలీవుడ్‌కి హాయ్ చెప్పనున్నారు. ‘గూఢచారి’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నారామె. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ మూవీ ఫేమ్, బ్రిటన్ నటుడు దేవ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కే హాలీవుడ్ సినిమా ‘మంకీ మ్యాన్’ చిత్రంలో శోభితాకి అవకాశం దక్కింది. దేవ్ పటేల్ దర్శకత్వం వహించనున్న మొదటి సినిమా ఇది. పాల్ అంగునావెలా, జాన్ కొలీ రచనా సహకారంతో దేవ్ పటేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. భారతదేశంలోని ముంబయ్ నగరం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని దేవ్ పటేల్ తెలిపారు. జైలు ఖైదీల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ సినిమా 2022లో విడుదల కానుంది. చదవండి: ఇప్పుడు నాకే అభ్యంతరం లేదు : గాయని కోమలి కోహ్లి ఫోటో షేర్ చేయడంలో ఆమె ఉద్దేశం ఏంటో..? -
హాలీవుడ్ సినిమాలో శోభితా దూళిపాళ్ల..
తెలుగు హీరోయిన్ శోభితా దూళిపాళ్ల హాలివుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆమె ఇప్పటికే తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. స్లమ్‌డాగ్ మిలియనీర్ మూవీ ఫేం, బ్రిటన్ నటుడు దేవ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కే ‘మంకీ మాన్’ చిత్రంలో శోభితా నటించనున్నారు. దేవ్ పటేల్ దర్శకతం వహిస్తున్న మొదటి సినిమా ఇది. ఇటీవల ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ సొంతం చేసుకుంది. పాల్ అంగునావెలా, జాన్ కొలీ రచన సహాకారంతో దేవ్ పటేల్ ఈ చిత్రానికి తెరకెక్కించనున్నారు. ఇందులో దేవ్ పటేల్‌తో పాటు షార్ల్టో కోప్లీ, సికందర్ ఖేర్ నటించనున్నారు. ఈ సినిమా 2022లో విడుదల కానుంది. చివరగా శోభతా ‘ఘోస్ట్ స్టోరీస్’లో కనిపించిన విషయం తెలిసిందే. ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్‌సిరీస్ ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. తెలుగులో తన మొదటి సినిమా ‘గూఢచారి’. ఆమె అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’లో నటిస్తోంది. ‘మంకీ మాన్’ చిత్రం భారతదేశంలోని ముంబై నగరం ఆధారం తెరకెక్కనుందని దేవ్ పటేల్ తెలిపారు. ఎందుకంటే తాను భారతదేశం నుంచి ప్రేరణ పోందినట్లు చెప్పారు. జైలు ఖైదీల నేపథ్యమున్న థ్రిల్లర్ మూవి ‘మంకీ మాన్’ అని తెలిపారు. చదవండి: కలలో కూడా అనుకోలేదు: శోభితా దూళిపాళ్ల -
త్వరలోనే పెళ్లి చేసుకోనున్న హీరోయిన్!
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ భామ ఫ్రిదా పింటో త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. తన చిరకాల స్నేహితుడు, అడ్వెంచర్ ఫొటోగ్రాఫర్ కోరీ ట్రాన్‌ను వివాహం చేసుకోనున్నారు. కోరీ పుట్టినరోజు సందర్భంగా తమకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఫ్రిదా ఇన్‌స్టాగ్రాంలో అభిమానులతో పంచుకున్నారు. ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసిన ఫ్రిదా... ‘ నా జీవితంలోని అత్యంత అందమైన క్షణాలను సృష్టించింది నువ్వే. ఇక నువ్వు ఇక్కడే ఉండాలి. కాదు కాదు నేనే నా ప్రేమతో నిన్ను ఇక్కడ ఉండేలా చేశాను. హ్యాపీ బర్త్‌డే స్వీట్ ఫియాన్సీ’ అని క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో ఫ్రిదా-కోరీలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటీమణులు లీసా రే, నర్గిస్ ఫక్రీ, అనైతా ఫ్రాఫ్ హార్ట్ ఎమోజీలతో ఫ్రిదాకు అభినందనలు తెలిపారు. కాగా డానీ బోయెల్ దర్శకత్వంలో తెరకెక్కిన స్లమ్‌డాగ్ సినిమాతో ఫ్రిదా తన కెరీర్‌ను ఆరంభించారు. ఈ మూవీలో తనకు జోడీగా నటించిన దేవ్ పటేల్‌తో కొన్నాళ్లపాటు ఆమె డేటింగ్ చేశారు. ప్రస్తుతం కోరీతో ప్రేమలో ఉన్న ఆమె త్వరలోనే వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక ఫ్రిదా.. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా మహిళా సాధికారికత, పిల్లల సంరక్షణ తదితర సామాజిక అంశాల్లో భాగస్వామ్యవుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. View this post on Instagram It all makes sense now. Life makes sense, the world makes sense, the past tears and trials make sense, what wise old lovers said about love makes sense, where I am makes sense and where I want to go completely makes sense. . You my love are just the most beautiful creation to have ever walked into my life. And you are here to stay. Well, I am making you stay. Ha! 😂 All my love with all my heart♥️. . Oh and Happiest Birthday sweet Fiancé ! . 📷 : @samanthamarq A post shared by Freida Pinto (@freidapinto) on Nov 21, 2019 at 8:07am PST -
నా పేరే ఎందుకు?
రిలీజ్ కాని సినిమాలకు చెందిన క్లిప్పింగ్‌లు, స్టిల్స్ అప్పుడప్పుడు నెట్లో వైరల్ కావడం ఈ టెక్నాలజీ యుగంలో సాధారణ విషయమై పోయింది. హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా నటించిన ‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమా రొమాంటిక్ సీన్ ఒకటి నెట్లో వైరల్‌గా మారింది. అది దేవ్ పటేల్, రాధికా ఆప్టే మధ్య సాగే శృంగార సన్నివేశం. ఈ వీడియోకి సంబంధించిన ఫొటోలు ‘రాధికా ఆప్టే ఇన్ లీక్డ్ సెక్స్ సీన్’ అని ఎక్కువగా నెట్లో తిరుగుతోంది. ఈ విషయంపై రాధికా ఆప్టే స్పందించారు. ‘‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమాలో బోలెడన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అందుకో హైలీ రొమాంటిక్ సీన్ ఒకటి లీకైంది. కానీ ‘రాధికా ఆప్టే ఇన్ లీక్డ్ సెక్స్ సీన్’ అని నా పేరుతోనే ఎందుకు? ఇది ప్రచారం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. అందులో దేవ్ పటేల్ కూడా ఉన్నారు కదా. హీరో పేరుతో కాకుండా హీరోయిన్ పేరుతో ఎందుకు వైరల్ చేస్తున్నారు. సొసైటీలో ఉన్న సైకో మెంటాలిటీస్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయనిపిస్తోంది’’ అన్నారు రాధిక. మూడేళ్ల క్రితం ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు రాధికా ఆప్టే. అప్పుడు లీకైన వీడియోలో నటుడు రాధికా ఆప్టేతో నటుడు ఆదిల్ హుస్సేన్ ఉన్నారు. అప్పుడు కూడా రాధికా ఇలానే స్పందించారు. -
ఆస్కార్‌కూ ‘ట్రంప్’ మంటలు!
- ముస్లిం దేశాలపై నిషేధానికి నిరసనగా వేడుకలకు రాని ఇరాన్ డైరెక్టర్ అస్ఘర్ ఫర్హాదీ - ట్రంప్ విధానాలపై మండిపాటు - ఆరు ఆస్కార్లు గెల్చుకున్న ‘లా లా ల్యాండ్’ - ఉత్తమ చిత్రంగా మూన్లైట్ ‘ట్రంప్’మంటలు ఆస్కార్ అవార్డులకూ పాకాయి! ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని నిరసిస్తూ ఇరాన్‌కు చెందిన చిత్ర దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ... అవార్డు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఉత్తమ విదేశీ విభాగంలో ‘ది సేల్స్‌మేన్’ ఆస్కార్‌ను గెల్చుకోగా.. అవార్డును అందుకునేందుకు ఆయన రావాల్సి ఉంది. అయితే ట్రంప్ విధానాలపై మండిపడుతూ ఈ కార్యక్రమానికి ఫర్హాదీ దూరంగా ఉండిపోయారు. ఇదిలా ఉండగా ఈసారి ఉత్తమ చిత్రంగా ‘మూన్లైట్’ఎంపికైంది. ఈ చిత్రం మొత్తం మూడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 14 కేటగిరీల్లో నామినేట్ అయిన ‘లా లా ల్యాండ్’చిత్రానికి ఆరు అవార్డులు దక్కాయి. ఒక్క అడుగు... భగవంతుణ్ణి అదొక్కటీ అడుగు... లైఫ్‌లో ఒక్కసారైనా ఆస్కార్‌తో అడుగేయాలని అడుగు... చిత్రసీమలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఆస్కార్ గెలిచి, అవార్డు వేదికపై ఓ అడుగేయాలనుకుంటారు. కొందరికి ఛాన్స్ త్వరగా వస్తుంది. మరికొందరికి లేటుగా వస్తుంది. అవకాశం ఎప్పుడొచ్చినా ఆస్కార్ అందుకున్న తర్వాత వేసే మొదటి అడుగు లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఉత్తమ నటి, నటుడు, దర్శకుడు, సహాయ నటి, సహాయ నటుడు, సంగీత దర్శకుడు... 89వ ఆస్కార్స్‌లో ముఖ్యమైన కేటగిరీల్లో తొలి అవార్డు (ఫస్ట్ స్టెప్) గెల్చుకున్నోళ్లు ఎక్కువమందే ఉన్నారు. ఈ ఫస్ట్ స్టెప్ మరిన్ని సక్సెస్ స్టెప్స్ వేసే జోష్, ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటూ... కంగ్రాచ్యులేషన్స్ టు ఆస్కార్ విన్నర్స్. 2017 ఆస్కార్ విజేతలు వీరే ఉత్తమ చిత్రం: మూన్లైట్; ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్ (మాంచెస్టర్ బై ద సీ); ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్) ; ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా ల్యాండ్) ; ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ (మూన్ లైట్) ; ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్ (ఫెన్సెస్) ; ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం ; ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్టస్ ; ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్ ఇన్ అమెరికా ; ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అరైవల్ ; ఉత్తమ సౌండ్ ; మిక్సింగ్ చిత్రం: హాక్సారిడ్జ్ ; ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: జాన్ గిల్బర్ట్ ; ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్మ్యాన్ (ఇరాన్ ) ; బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా ; బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: పైపర్ ; ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చిత్రం: లా లా ల్యాండ్ ; బెస్ట్ విజువల్ ఎఫెక్టస్: ద జంగిల్ బుక్ ; బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ద వైట్ హెల్మెట్స్ ; బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్ ; బెస్ట్ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్ ; బెస్ట్ ఒరి జినల్ ; స్కోర్: లా లా లాండ్ ; బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్ (లా లా ల్యాండ్) ; బెస్ట్ ఒరిజినల్ స్కీన్ర్‌ప్లే: మాంచెస్టర్ బై ద సీ ; బెస్ట్ అడాప్టెడ్ స్కీన్ర్‌ప్లే: మూన్లైట్ ఆ గీత చెరగాలి – అస్ఘర్ ఫర్హాదీ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఇరానియన్ మూవీ ‘ది సేల్స్‌మేన్’కు అవార్డు దక్కింది. ఆ చిత్రదర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్ల తన ఆగ్రహావేదనను వ్యక్తం చేశారు. ‘‘ముస్లిమ్ దేశాలపై ట్రంప్ విధించిన ‘ట్రావెల్ బ్యాన్’కు నిరసనగా ఈ అవార్డు వేడుకకు హాజరు కాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. తన మనోభావాలను లిఖితపూర్వకంగా ఆస్కార్ అవార్డు కమిటీకి పంపించారు. ‘‘పలు ముస్లిమ్ దేశాల పౌరులపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఆ దేశాలను, అక్కడి ప్రజలను గౌరవిస్తున్నాను. అందుకే అవార్డు తీసుకోవడానికి రాలేదు. ప్రపంచాన్ని మనము, మన శత్రువులు అని విభజించడం భయంగా ఉంది. యుద్ధానికి దారి తీసే ఘోరమైన నిర్ణయాలివి. ఇది సరికాదు. ఫిలిం మేకర్స్ తమ కెమేరాలను ఎక్కుపెట్టి కుల, మతాలనే అడ్డుగోడను చెరిపేయగలరు. ‘మేము, ఇతరులు.. అనే ఆ ఇద్దరి మధ్య సమానత్వాన్ని పెంపొందించగలరు. ఈరోజు ఆ సమానత్వం చాలా అవసరం’’ అంటూ అస్ఘర్ మనోభావాలను హోస్ట్ చదివారు. విన్న వీక్షకులు ఉద్వేగానికి గురయ్యారు. కొందరు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నా హార్ట్ ముక్కలైందన్నాడు! – ఉత్తమ నటుడు క్యాసే ఎఫ్లెక్ ఉత్తమ నటుడిగా క్యాసే ఎఫ్లెక్ పేరు ప్రకటించగానే, అతడు సీట్లో నుంచి వెంటనే లేచి తన అన్నయ్య బెన్ ఎఫ్లెక్ వద్దకు వెళ్లి కౌగిలించుకున్నారు. ఆల్రెడీ ఉత్తమ చిత్రం (నిర్మాతగా), బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే (మాట్ డామన్తో కలసి).. రెండు సార్లు్ల బెన్ ఎఫ్లెక్ ఆస్కార్స్ అందుకున్నారు. ఇప్పుడు క్యాసే ఎఫ్లెక్కి అవార్డు రావడంతో ఆస్కార్స్ అందుకున్న సిబ్లింగ్స్ (తోబుట్టువులు) లిస్టులో ఈ అన్నదమ్ములిద్దరూ 16వ స్థానం సంపాదించారు. ఇక, అవార్డు స్వీకరించిన తర్వాత క్యాసే ఎఫ్లెక్ మాట్లాడుతూ – ‘‘నాకు ఎలా నటించాలో నేర్పిన మొదటి వ్యక్తుల్లో దర్శక–నటుడు డెంజెల్ వాషింగ్టన్ ఒకరు. జస్ట్.. ఇప్పుడే ఆయన్ను కలిశాను. థాంక్యూ! ఈ అవార్డు నాకెంతో విలువైనది. ఆస్కార్ కమ్యూనిటీలో భాగం కావడం నా అదృష్టం. ఇంతకు మించి మాటలు రావడం లేదు. ‘మాంచెస్టర్ బై ద సీ’ యూనిట్ సభ్యులకు థ్యాంక్స్. బెన్... ఐ లవ్ యూ’’ అన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ స్పీచ్‌లో అన్నయ్య బెన్ ఎఫ్లెక్ పేరును క్యాసే ప్రస్తావించలేదు కానీ, మాజీ భార్య గురించి పేర్కొన్నారు. ఈ ఆస్కార్స్ స్పీచ్‌లో పిల్లలతో పాటు మాజీ భార్య పేరు మర్చిపోయారు. ‘‘ఆస్కార్ వేదిక దిగిన మూడు సెకన్లకు నా ఫోన్ మోగింది. ‘మా గురించి చెప్పడం మర్చిపోయావ్. నా హార్ట్ ముక్కలైంది’ అని మా అబ్బాయి అన్నాడు’’ అని బ్యాక్ స్టేజిలో క్యాసే ఎఫ్లెక్ పేర్కొన్నారు. ఆస్కార్ అందుకున్న తొలి ముస్లిం ఇలాంటి పాత్రలకు బానిసను – ఉత్తమ సహాయ నటుడు మహేర్షలా అలీ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అందుకున్న తొలి ముస్లిమ్ వ్యక్తిగా మహేర్షలా అలీ (43) చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ చిత్రం ‘మూన్ లైట్’లో ప్రదర్శించిన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా మహేర్షలా అలీకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ చిత్రంలో అలీ డ్రగ్ డీలర్ జువాన్ పాత్రలో ఒదిగిపోయారు. జెఫ్ బ్రిడ్జెస్, హెడ్జెస్, దేవ్ పటేల్, షానూన్ వంటి అగ్రనటులతో పోటీపడి అలీ ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. ‘లయన్’ చిత్రంతో సహాయ నటుడి విభాగంలో నిలిచిన భారత సంతతి నటుడు దేవ్ పటేల్‌కు నిరాశే ఎదురైంది. అవార్డు తీసుకున్న తర్వాత మహేర్షలా అలీ ఉద్వేగభరితమైన స్పీచ్ ఇచ్చారు. ‘‘మూన్ లైట్’ వంటి సినిమాల్లోని పాత్రలకు నేను బానిసను. ఈ చిత్రదర్శకుడు బెర్రిజెన్ కిన్స్కు థ్యాంక్స్. నటన నేర్చుకోవడంలో నాకు సహకరించిన టీచర్స్, ప్రొఫెసర్స్ అందరికీ ధన్యవాదాలు. ‘ఏ అవార్డు అయినా మనకు ఇచ్చినది కాదు. చిత్రంలోని పాత్రకు ఇచ్చినది’ అని వాళ్లు అనేవాళ్లు. నా ఫీలింగ్ కూడా అదే. నా భార్య సామి కరీమ్‌కు రుణపడి ఉంటాను’’ అన్నారు. 2013లో సామి కరీమ్‌తో మహేర్షల వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితమే కరీమ్ ఓ పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు భర్త ఆస్కార్ అందుకున్నారు. దీంతో మహేర్షల దంపతులు డబుల్ హ్యాపీ. ఆ సంగతలా ఉంచితే, వాస్తవానికి అలీ క్రిస్టియన్ అనీ, అయితే ఓ సందర్భంలో మసీదుకు వెళ్లి వచ్చిన తరువాత ముస్లిమ్‌గా మారారని సమాచారం. అతను అహ్మదీయుడు అనేది కొందరి వాదన. వాదించుకునేవాళ్లు వాదించుకుంటూనే ఉంటారు. ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేని మహేర్షలనిండు మనసుతో శుభాకాంక్షలు చెబుతున్నవాళ్లకు ధన్యవాదాలు తెలియజేయడంలోనూ, ఇప్పుడే తన జీవితంలోకి వచ్చిన పసి పాపను అపురూపంగా చూసుకోవడంలోనూ బిజీ అయ్యారు. లా లా.. లవ్‌లో పడ్డా – ఉత్తమ దర్శకుడు డామీన్ ఛాజెల్లె ఇప్పటివరకూ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్స్ అందుకున్న వ్యక్తుల్లో డామీన్ ఛాజెల్లె (‘లా లా ల్యాండ్’ దర్శకుడు) చిన్నోడిగా చరిత్ర సృష్టించారు. అతడి వయసు 32 ఏళ్లు. ఫస్ట్ టైమ్ ఆస్కార్ అందుకున్న డామీన్ మాట్లాడుతూ – ‘‘ప్రేమ గురించి చెప్పిన సినిమా ‘లా లా ల్యాండ్’. ఈ సినిమా తీస్తున్న టైమ్‌లోనే నేను ప్రేమలో పడడం నా అదృష్టం. దీనర్థం... నాతో పాటు నువ్వూ (డామీన్ ప్రేయసి ఒలీవియా హామిల్టన్) ఈ అవార్డును పంచుకున్నట్లే’’ అన్నారు. ఆ శరీరాలను తవ్వి బయటకు తీయాలి! – ఉత్తమ సహాయ నటి వయోలా డేవిస్ ‘‘మీకో విషయం తెలుసా? అత్యంత ప్రతిభావంతులందరూ కలిసుండే చోటు ఒకటుంది. అదే శ్మశానం’’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ వయోలా డేవిస్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రచయిత ఆగస్ట్ విల్సన్ రాసిన ‘ఫెన్సెస్’ అనే కథ ఆధారంగా అదే పేరుతో రూపొందిన చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు. 2005లో ఆగస్ట్ విల్సన్ చనిపోయారు. ఆయన రాసిన కథలోని పాత్ర తనకు అవార్డు తెచ్చిపెట్టినందుకుగాను ఆస్కార్ వేదికపై వయోలా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ఇంకా వయోలా మాట్లాడుతూ – ‘‘నువ్వు ఎలాంటి కథలు చెప్పాలనుకుంటావ్? అని కొంతమంది నన్ను అడుగుతుంటారు. ‘తవ్వి, పాతిపెట్టిన ఆ శరీరాలను బయటకు తీయాలి. ఆ మనుషుల కథలను తెలుసుకోవాలి. పెద్ద పెద్ద కలలు కని, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడి, ఫలాలు అందుకోని ఆ వ్యక్తుల కథలు చెప్పాలనిపిస్తుంది’ అంటుంటాను’ అన్నారు. ఆగస్ట్ విల్సన్ వంటి ప్రతిభావంతుల మరణాన్ని ఉద్దేశించే ఆమె ఇంత ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘నేను ఆర్టిస్టును అయ్యాను. అందుకు దేవుడికి రుణపడి ఉంటాను. సెలబ్రిటీల హోదాలో బ్రతికేందుకు ఇదొక మంచి ప్రొఫెషన్. ఎలా జీవించాలో, ఎలా ప్రేమించాలో ప్రతి రోజూ.. నాకు నేర్పే నా భర్త , నా కూతురికి రుణపడి ఉంటాను. డైరెక్టర్ డెంజెల్ వాషింగ్టన్కు ధ్యాంక్స్’’ అని వయోలా డేవిస్ అన్నారు. మూడు సార్లు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన, తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న అమెరికన్– అఫ్రికన్ వుమెన్‌గా వయోలా రికార్డ్ సాధించారు. తప్పు తప్పే.. శుద్ధ తప్పే! ఏం జరిగింది? ఓ చిత్రం పేరుకు బదులు మరో చిత్రం పేరును చదివారు. చెప్పుకోవడానికి చిన్న తప్పే! కానీ, ఏదో పొరపాటు జరిగిందని సర్దిచెప్పుకోవడానికి వీలు లేని తప్పు జరిగింది. ఈ తప్పే కాదు.. ఇంకో శుద్ధ తప్పు కూడా జరిగింది. ఈ ఏడాది జరిగిన 89వ ఆస్కార్స్‌లో ‘మూన్లైట్’ ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. కానీ, ‘మూన్లైట్’ పేరు ప్రకటించిన తీరు మాత్రం సూపర్‌హిట్ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. అసలు ఏం జరిగిందంటే... జోక్ కాదు.. నిజమే! క్లాసిక్ ఫిల్మ్ ‘బోనీ అండ్ క్లయిడే’ విడుదలై 50 ఏళ్లైంది. ఈ సందర్భంగా అందులోని స్టార్స్ వారెన్ బీట్టీ, ఫాయే డన్ అవేలను 89వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రం పేరును ప్రకటించమని వేదికపైకి పంపారు. వాళ్లు ‘లా లా ల్యాండ్’ పేరును ప్రకటించారు. ఒక్కసారిగా హర్షాతిరేకాలు.. కరతాళ ధ్వనులు.. ‘లా లా ల్యాండ్’ చిత్ర బృందం అవార్డును స్వీకరించడానికి వేదికపైకి చేరుకుంది. యాక్సెప్టెన్స్ స్పీచ్‌లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇంతలో, ‘లా లా ల్యాండ్’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జోర్డాన్ హోరోవిట్జ్ మైక్ అందుకుని... ‘‘ఉత్తమ చిత్రం కేటగిరీ విజేత ‘మూన్లైట్’. దిస్ ఈజ్ నాట్ ఎ జోక్’’ అంటూ అవార్డు కార్డును అందరికీ చూపించారు. ఒక్కసారిగా వేదికపై ఉన్న మిగతా చిత్ర బృందంలో ఆనందం ఆవిరైంది. ఆ వెంటనే వారంతా వేదికను ఖాళీ చేశారు. తర్వాత ‘మూన్లైట్’ చిత్ర బృందం అవార్డును అందుకుంది. ‘లా లా ల్యాండ్’ సినిమా క్లైమాక్స్‌లో ఒక్క క్షణం హీరో హీరోయిన్ కలుసుకున్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే... హీరోయిన్ మరొకర్ని పెళ్లి చేసుకుంటుంది. థియేటర్లో ప్రేక్షకులు అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అనుకుంటారు. ఆస్కార్స్ వేదికపై జరిగిన ఘటన చూశాక.. మళ్లీ సేమ్ ఫీలింగ్ కలగక మానదు. (ఆస్కార్-2017: ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తప్పే.. క్షమించండి! ఆస్కార్స్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటనపై ప్రైజ్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) క్షమాపణలు కోరింది. 83 ఏళ్లుగా ఆస్కార్స్ బ్యాలెట్ కౌంటింగ్‌ను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. ‘‘ఉత్తమ చిత్రం పేరును ప్రకటించే సమయంలో జరిగిన తప్పుకి అందరికీ క్షమాపణ చెబుతున్నాం’’ అని పీడబ్ల్యూసీ సంస్థ పేర్కొంది. ప్రెజెంటర్స్కు రాంగ్ కవర్ ఇవ్వడంతో ఈ తప్పు జరిగిందట! ఇంకొకరి బాధలో ఆనందం ఎక్కడుంది? ఆస్కార్స్ వేదికపై జరిగిన ఘటన పట్ల మహేర్షలా అలీ స్పందిస్తూ – ‘‘ఉత్తమ చిత్రంగా ‘లా లా ల్యాండ్’ పేరు ప్రకటించగానే నేనేమీ సర్ప్రైజ్ కాలేదు. ఆ సినిమా బాగుంది, బాగా ఆడింది. వాళ్లు వేదికపై ఉన్నప్పుడు సెక్యూరిటీ, ఇతరులు వచ్చి డిస్ట్రబ్ చేస్తుంటే వర్రీ అయ్యాను. అప్పుడు ‘మూన్లైట్’ పేరు ప్రకటించగానే వేదికపైకి వెళ్లాలనుకోలేదు. అలాంటి సందర్భంలో ఆనందపడడం చాలా కష్టం. కానీ, అదృష్టవశాత్తూ మేము ఉత్తమ చిత్రం పురస్కారంతో బయటకు నడిచాం’’ అన్నారు. ఎమ్మా స్టోన్ (ఉత్తమ నటి, ‘లా లా ల్యాండ్’) మాట్లాడుతూ –‘‘ఓ గాడ్, ఐ లవ్ ‘మూన్లైట్’ సోమచ్. అఫ్కోర్స్, ‘లా లా ల్యాండ్’ పేరు ఉత్తమ చిత్రంగా వినడం అద్భుతంగా ఉంది. ‘మూన్లైట్’ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు. బతికి ఉన్న మనిషిని చంపేశారు! బతికి ఉన్న మనుషులకు నివాళులు అర్పిస్తారా? అలా చేస్తే బతికున్నవాళ్ల ఫీలింగ్ ఏంటి? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ‘జాన్ చాప్మాన్’ని అడిగితే చెబుతారు. ఎవరీ జాన్ చాప్మాన్ అంటే? ఈవిడ ఆస్ట్రేలియన్ ఫిలిం ప్రొడ్యూసర్. ‘ది పియానో’, ‘లవ్ సెరనేడ్’, ‘హోలీ స్మోక్’ వంటి పలు చిత్రాలు నిర్మించారు. వయసు 66. మంచి ఆరోగ్యంతో హాయిగా ఉన్నారు. కానీ, గతేడాది తిరిగి రాని లోకాలకు వెళ్లిన ప్రముఖులకు నివాళులర్పించే కార్యక్రమంలో ఆస్కార్ అవార్డు కమిటీ జాన్ చాప్మాన్ ఫొటోను చూపించింది. గతేడాది చనిపోయిన కాస్ట్యూమ్ డిజైనర్ ‘జానెట్ ప్యాటర్సన్’కి నివాళులర్పిస్తూ, ఆమె ఫొటోకు బదులుగా చాప్మాన్ ఫొటోను చూపించారు. దాంతో ‘నేను బతికే ఉన్నాను. బాగున్నాను కూడా. నిర్మాతగా యాక్టివ్‌గా ఉన్నాను’ అని చాప్మాన్ చెప్పుకోవాల్సి వచ్చింది. జానెట్ ప్యాటర్సన్తో కలసి తాను సినిమాలు చేశానని, ఆమె మంచి స్నేహితురాలని కూడా చాప్మాన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అనిపించుకున్న ఆస్కార్ అవార్డు లాంటి భారీ వేడుకలో ఇలాంటి తప్పులు జరగడం నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణిని బయటపెట్టింది. అదృష్టం.. అవకాశం కలిసొస్తేనే... – ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఎమ్మా స్టోన్.. ఆస్కార్స్‌కి నామినేట్ అయిన సహచర నటీమణులపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఫ్యామిలీకి థ్యాంక్స్ చెబుతూ స్పీచ్ ప్రారంభించారు. ‘‘అదృష్టం, అవకాశం బాగా కలిసొచ్చినప్పుడే ఇలాంటి సందర్భం వస్తుందని నాకు అర్థమైంది. జీవితంలో ఒక్కసారే ‘లా లా ల్యాండ్’ వంటి సినిమాలో నటించే ఛాన్స్ వస్తుంది. నాపై నమ్మకంతో ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు డామీన్ ఛాజెల్లెకు థ్యాంక్స్. ప్రతిసారీ, ప్రతి సన్నివేశంలో నేను బాగా నటించేలా సహకరించిన ర్యాన్ గోస్లింగ్కి థ్యాంక్స్. నేనింకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది’’ అన్నారు. ఓంపురికి ఆస్కార్ నివాళి ప్రతి ఆస్కార్ వేడుకలోనూ గడచిన 12 నెలల్లో స్వర్గస్తులైన సినీ ప్రముఖులకు నివాళులు అర్పించడం అనవాయితీ. అందులో భాగంగా భారతీయ నటుడు ఓంపురికి నివాళులర్పించారు. ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘వోల్ఫ్’, ‘ద ఘోస్ట్ అండ్ ద డార్క్నెస్’, ‘సచ్ ఎ లాంగ్ జర్నీ’, ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’లతో పాటు మరికొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లో ఓంపురి నటించారు. ఆయన నటించిన చివరి ఇంగ్లీష్ చిత్రం ‘వైశ్రాయస్ హౌస్’ ఈ నెల 12న బెర్లిన్‌లో విడుదలైంది. మార్చి 3న యూకేలో విడుదల కానుంది. ‘‘25 ఏళ్ల నుంచి వరుసగా హాలీవుడ్, బ్రిటీష్ సినిమాల్లో నటిస్తున్న ఏకైక నటుడు ఓంపురి. ఈరోజు ఆస్కార్స్ ఆయనకు నివాళులు అర్పించింది. ఆస్కార్స్ నివాళులు అందుకున్న తొలి భారతీయ నటుడు ఓంపురీనే. థ్యాంక్యూ అకాడెమీ అవార్డ్స్. థ్యాంక్యూ ఎవ్రీవన్. వుయ్ మిస్ ఓం’’ అని ఓంపురి ఫ్యామిలీ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశీ గాళ్స్ హంగామా విదేశీ తారలకు ధీటుగా ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో పాల్గొని, రెడ్ కార్పెట్‌పై నడవడం అంత వీజీ కాదు.. దానికి చాలా ఖలేజా ఉండాలి. మన దేశీ భామ ప్రియాంకా చోప్రా తన దమ్మేంటో గతేడాది ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొన్నప్పుడు నిరూపించుకున్నారు. వైట్ గౌన్, లైట్ మేకప్, డైమండ్ జ్యుయెలరీలో ఆమె మెరిసిపోయారు. ఈసారి కూడా విదేశీయుల దగ్గర మార్కులు కొట్టేశారు. మరో భామ దీపికా పదుకొనే కూడా సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ‘ఆఫ్టర్ పార్టీ’ (అవార్డు వేడుక ముగిసిన తర్వాత జరిగే పార్టీ)లో దీపికా పదుకొనే పాల్గొన్నారు. నలుపు రంగు గౌనులో ‘వెరీ నైస్’ అనిపించుకున్నారు. మన దేశీ భామలా... మజాకానా! వయ్యారి భామ.. నీ హంస నడక... 16,500 చదరపు అడుగుల ఎర్ర తివాచీ అది. పదహారణాల తెలుగమ్మాయిలు నడిస్తేనేమి... పరాయి దేశపు భామలు నడిస్తేనేమి... చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసినా.. ఇంకా ఏదో ‘మిస్’ అయ్యామని మగ మనసులు బాధపడిపోతాయ్. వచ్చినవాళ్లు వచ్చినట్లు వయ్యారంగా వాక్ చేసుకుంటూ వెళుతుంటే చూసేకొద్దీ చూడబుద్ధేస్తోందంటూ ఆ మనసులు గారాలు పోయాయి. భారీ రెడ్ కార్పెట్ పై భామలు అడుగులో అడుగేస్తూ, ఆకట్టుకున్నారు. ప్రతి ఏడాదీ రెడ్ కార్పెట్ ఈవెంట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచినట్లే ఈ ఏడాది కూడా నిలిచింది. చీరకట్టు @ రెడ్ కార్పెట్టు భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీరకట్టు. ఆ చీరకట్టు 89వ ఆస్కార్ వేడుకల్లో వీక్షకులతో పాటు సినీ ప్రముఖుల కళ్లను కట్టిపడేసింది. ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో నామినేట్ అయిన దేవ్ పటేల్.. తన తల్లి అనితా పటేల్‌తో కలసి ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు. చీరకట్టులో భారతీయ హుందాతనం చూపించిన అనితా పటేల్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ‘‘దేవ్ పటేల్‌కి ఆస్కార్ రాకున్నా.. 26 ఏళ్లకు నామినేషన్ దక్కడం అద్భుతమైన విషయం. ఆ లెక్కన దేవ్ విన్నరే. ఇంత త్వరగా దేవ్‌కి ఆస్కార్ నామినేషన్ వస్తుందని ఊహించలేదు’’ అని అనితా పటేల్ పేర్కొన్నారు. -
మరో భారతీయ కథతో దేవ్ పటేల్
స్లమ్ డాగ్ మిలియనీర్, ద మ్యాన్ హు నో ఇన్ఫినిటీ లాంటి భారతీయ నేపథ్యం ఉన్న చిత్రాలతో ఆకట్టుకున్న బ్రిటీష్ నటుడు దేవ్ పటేల్, మరో భారతీయ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సరూ బ్రియర్లీ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లయన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏ లాంగ్ వే హోం నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గార్త్ డేవిస్ దర్శకుడు. కలకత్తా వీదుల్లో తప్పి పోయిన ఓ ఐదేళ్ల కుర్రాడు, ఓ ఆస్ట్రేలియా కుటుంబం చేరదీసే వరకు ఎలాంటి కష్టాలు పడ్డాడు. వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు. 25 ఏళ్ల తరువాత జీవితంలో స్థిరపడిన ఆ యువకుడు తిరిగి తన గతాన్ని గుర్తు చేసుకోని తన కుటుంబం కోసం ఎలాంటి అన్వేషన సాగించాడు అన్న కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. హాలీవుడ్ నటులు నికోలే కిడ్మన్, రూనీ మారా, డేవిడ్ వెన్హామ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
వెండితెరపై గణిత మాంత్రికుడి సంచలనం
భగవంతుడి ఆమోదం లేనిదే ఏ ఆలోచనా సూత్రంగా మారదు.. లోకానికి అది ఉపయోగపడదు: శ్రీనివాస రామానుజన్ సినిమా పేరు: ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ జానర్: బయోగ్రాఫికల్ డ్రామా దర్శకత్వం, స్క్రీన్ ప్లే: మ్యాథ్యూ బ్రౌన్ ఆధారం: రాబర్ట్ కనిగెల్ రాసిన 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ' పుస్తకం నటీనటులు: దేవ్ పటేల్, దేవికా భిసే, జెర్మీ ఇరోన్స్, స్టీఫెన్ ఫ్రే తదితరులు సంగీతం: కోబే బ్రౌన్ సినిమాటోగ్రఫీ: ల్యారీ స్మిత్ ఎడిటింగ్: జేసీ బాండ్ విడుదల: ఇండియాలో ఏప్రిల్ 28, 2016. (యూకేలో ఈ నెల 8న విడుదలైంది. వాస్తవానికి టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(సెప్టెంబర్ 17, 2015)లోనే ఈ సినిమాను విడుదలచేశారు) నిడివి: 108 నిమిషాలు భాష: ఇంగ్లీష్ సర్ ఆల్బర్ట్ ఐజక్ ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్.. భౌతిక, ఖగోళ శాస్త్రవేత్తలుగా ప్రపంచఖ్యాతి పొందిన ఈ ఇద్దరూ ఆయా శాస్త్రాలకు వెన్నెముకైన గణిత శాస్త్రంలోనూ మేధావులు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీయే సర్వస్వంగా వారు చేసిన పరిశోధనలు, ఆవిష్కరించిన సూత్రాలు ప్రపంచాన్ని సరికొత్త దిశలోకి నడిపాయి. ఆ ఇద్దరి సరసన శ్రీనివాస రామానుజన్ పేరు కూడా ఉండాలని, ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదని 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ' సినిమా చూసిన తర్వాత అనిపిస్తే బహుశా ఆ భావన తప్పుకాదేమో! భారతీయ గణిశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జీవితంపై రూపొందించిందే 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ' సినిమా. శ్రీనివాస రామానుజన్ గా 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ దేవ్ పటేల్, లండన్ లో ఆయనకు అన్నీ తానై నడిపించిన ఫ్రొఫెసర్ జి.హెచ్.హార్డీగా జెర్మీ ఇరోన్స్, సతీమణిగా దేవికా భిసే నటించిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు, మేధావుల మెచ్చుకోళ్లతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్ లో గురువారం విడుదలైంది. కథేంటి? దక్షిణ భారతదేశంలోని ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించి, బాల్యం నుంచే కష్టాలు అనుభవించి, ఎలాంటి శిక్షణ లేకుండా కేవలం స్వీయ సాధనతో గణితశాస్త్రంలో అతి క్లిష్టమైన సమస్యలు పరిష్కరించగల మేథస్సున్న శ్రీనివాస రామానుజన్ తనను తాను పాశ్చాత్య ప్రపంచం ముందు ఎలా ఆవిష్కరించుకున్నాడు? ఎలాంటి ఆవిష్కరణలు చేశాడు? ఆ క్రమంలో రామానుజన్ కేంబ్రిడ్జ్ కు వెళ్లేందుకు మూల కారకుడైన ఫ్రొఫెసర్ హెచ్ జి హార్డీతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? భిన్న దృవాలైన ఈ ఇద్దరూ కొత్తకొత్త ఆవిష్కరణలతో ఒకరినొకరు ఎలా ఖంగుతినిపించుకున్నారు?.. లాంటి ప్రశ్నలకు దృశ్యరూపక సమాధానమే 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ' సినిమా. ఇందులో ప్రధానంగా రామానుజన్, హార్డీల 'లెక్కల' అనుబంధాన్నే హైలెట్ చేశారు దర్శకుడు మ్యాథ్యూ బ్రౌన్. భగవంతునిపై అచంచల విశ్వాసాన్ని కనబర్చే రామానుజన్ 'ఏ ఆలోచనైనా దేవుని ఆమోదం పొందనిదే సూత్రంగా మారదు' అని వాదిస్తాడు. ఈ స్టేట్ మెంట్ ను నిష్కర్షగా కొట్టిపారేసే హార్డీ హేతువాది. 'అన్ని ఆవిష్కరణలకు హేతువే మూలం' అని రామానుజన్ తో అంటాడు. భగవంతుడు తన ద్వారా చేయిస్తోన్న ఒక్కో పరిశోధన, వాటి అద్భుత ఫలితాలను వివరిస్తూ, అది దేవుడే చేయించాడని హార్డీని నమ్మించడానికి ప్రయత్నించే రామానుజన్, నమ్మిక మనిషిని ఎంతదూరం తీసుకెళుతుందో ప్రత్యక్షంగా చూస్తూ కూడా చివరివరకు దేవుణ్ని నమ్మని హార్డీల పాత్రలే ఈ సినిమాకు మూలం. ప్రాణం. విదేశాలకు వెళ్లి 'మైలపడి' వచ్చిన తమను బంధువులు ఆదరిస్తారా? తమకు పుట్టిన బిడ్డలకు పెళ్లిళ్లు అవుతాయా? అని కంగారుపడే రామానుజన్ సతీమణి జానకీ అమ్మాళ్ పాత్ర, హార్డీ సహాధ్యాయులు మరికొందరు సినిమాను మరింత రక్తికట్టిస్తారు. ఎలా తీశారు? లెక్కల మనిషి మీద సినిమా తీయడానికి ఏముంటుంది? డ్రామా పండుతుందా? ఇంతక ముందు గణిత శాస్త్రవేత్త జాన్ నాష్ జీవితం ఆధారంగా రూపొందించిన 'ఎ బ్యూటిఫుల్ మైండ్' కలెక్షన్ల తోపాటు ఆస్కార్ అవార్డులనూ కొల్లగొట్టింది. నాష్ స్కిజోఫ్రీనియా పేషెంట్ కాబట్టి ఆ సినిమాలో నాటకీయత ఉంటుంది. మరి రామానుజన్ లైఫ్ లో డ్రమెటికల్ పాయింట్ ఏంటి? దేవుడు. అవును. సాధారణంగా శాస్త్రవేత్తలెవ్వరూ (అప్పట్లో) దేవుణ్ని నమ్మేవారు కాదు. రామానుజన్ కు మాత్రం దేవుడు, ఆయన మనుషులకు నిర్ధేశించిన శాసనాలపట్ల అచంచల విశ్వాసం. ఆ విశ్వాస ప్రకటనే తన పరిశోధనలని బలంగా నమ్ముతాడాయన. ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి దాదాపు 12 ఏళ్లు పట్టిందట దర్శకుడు మ్యాథ్యూకు! పుస్తకం ఆధారంగా తీయబోయే సినిమా స్క్రీన్ ప్లేకు ఇంత సమయం తీసుకోవడం ఎందుకు? అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం తెరపైనే కనిపిస్తుంది. 20వ శతాబ్ధపు తొలినాళ్లలో కేంబ్రిడ్జ్ వర్సిటీ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు మ్యాథ్యూ. అక్కడి క్లాస్ రూమ్ లు, బెంచ్ లు, దుస్తులు, ఆఖరికి బ్లాక్ బోర్డ్ పై రాసే చాక్ పీస్ కూడా అప్పటికాలానిదిలా చూపించేందుకు దర్శకుడు తీవ్రంగా శ్రమించాడు. బహుశా 12 ఏళ్లు సాగిన స్క్రీన్ ప్లే రచన కాబట్టి తన సినిమాలోని అణువణువునూ అద్భుతంగా ఆవిష్కరించడలిగాడు మ్యాథ్యూ. మూలస్తంభాలైన రామానుజన్, హార్డీ పాత్రలకు దేవ్ పటేల్, జెర్మీ ఇరోన్స్ ప్రాణప్రతిష్టచేశారు. దాదాపు అన్ని విదేశీ, దేశీ పత్రికలు, మీడియా సంస్థలు మంచి రేటింగ్స్ ఇచ్చాయీ సినిమాకు. రామానుజన్ గా మాధవన్ ! మొదట ఈ సినిమాలో రామానుజన్ పాత్రకు మాధవన్ ను ఎంపిక చేశారట. 2012లోనే మ్యాథ్యూ చెప్పిన 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ' స్క్రిప్ట్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట మాధవన్. అయితే రామానుజన్ పాత్రను ఎవరైనా అంతర్జాతీయ గుర్తింపు పొందిన నడుడితో చేయిస్తే సినిమాకు ప్లస్ అవుతుందనే ఆలోచనతో చివరికి దేవ్ పటేల్ ను ఎంపిక చేశారు. 'స్లమ్ డాగ్ మిలియనీర్' హిట్ తర్వాత దేవ్ పటేల్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం వల్లే అతనికి ఈ చారిత్రక సినిమాలో లభించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. రామానుజన్ జీవితం (బ్రీఫ్ గా) గణిత మేధావిగా ప్రపంచ ఖ్యాతిగాంచిన శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 1887, డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ చీరల దుకాణంలో గుమస్తాగా పని చేసేవారు. తల్లి కోమలటమ్మాళ్ గృహిణి. 1909, జులై 14వ తేదీన రామానుజన్ కు జానకీ అమ్మాళ్ అనే తొమ్మిదేళ్ళ బాలికతో వివాహమైంది. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. తాన సిద్ధాంతాలను.. అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కి చూపడం, ఆయన వాటిని తనకు తెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించడం, అలా అవి బాంబే ప్రొఫెసర్ సల్ధానా అతని సిద్ధాంతాలను చూడటం జరిగింది. చాలా మందికి రామానుజన్ సిద్ధాంతాలు అర్థంకాలేదు. ఎందుకంటే అప్పటికవి అడ్వాన్స్డ్ థియరీస్! కేంబ్రిడ్జ్ కు చెందిన ప్రొఫెసర్ హార్డీ రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. 1914, మార్చి 17న ఇంగ్లండ్ కు వెళ్లిన రామానుజన్ కు శాఖాహారపు అలవాట్ల వల్ల అక్కడ సరిగా భోజనం చేసేవారు కాదు. దీనికతోడు విపరీతంగా శ్రమించేవారు. తక్కువ సమయంలోనే 32 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. శరీరం క్రమంగా వ్యాధిగ్రస్థమైంది. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నపుడు కూడా హార్డీతో 1729 సంఖ్య ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యపర్చారు. ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగాన్ని, అంకిత భావానికి నిదర్శనం. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రామానుజన్ 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. అనేక రకాల వైద్యం చేయుంచుకున్నా ఆయన కోలుకోలేక పోయాడు. 1920, ఏప్రిల్ 26న కన్నుమూశారు. ప్యూర్ మేథమెటిక్స్ లో నంబర్ థియరీలపై రామానుజన్ చేసిన పరిశోధనలు.. స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనలు పురోగమించడానికి ఉపయోగపడ్డాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్-తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు కొన్ని ఇప్పటికీ అపరిష్కృతం గానే ఉండటం గమనార్హం. -
'డేటింగ్‌తో విడిపోయి మరోసారి కలిసి..'
ముంబయి: అస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న స్లమ్ డాగ్ మిలీనియర్ చిత్ర నటులు, ఒకప్పటి ప్రేమికులు ఫ్రిదా పింటో, దేవ్ పటేలో మరోసారి కలిశారు. చెరొదిక్కుకూ వెళ్లిపోయి దాదాపు ఏడాదికాలం పాటు జంటగా కనిపించని వీరు ఓ స్వచ్ఛంద కార్యక్రమం కోసం మాత్రం మరోసారి పక్కపక్కనే నవ్వులు పూయిస్తూ కనిపించారు. చిన్నపిల్లలకు విద్యనందించి అక్షరాస్యతను పెంపొందించడం ద్వారా దేశంలోని పేదరికాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు ప్రధమ్ అనే చారిటబుల్ సంస్థ చేస్తున్న కార్యక్రమం ప్రచారానికి వీరిద్దరు హాజరయ్యారు. స్లమ్ డాగ్ మిలీయనీర్ చిత్రం అనంతరం ప్రేమికులుగా మారిన ఫ్రిదా పింటో, దేవ్ పటేల్ 2009లో డేటింగ్ ప్రారంభించారు. అలా ఆరేళ్లు గడిచిన తర్వాత 2014లో తమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. -
ఇప్పటికీ స్నేహితుడే..!
గాఢాతి గాఢంగా ప్రేమించుకుని కూడా చివరకు ఏదో ఒక కారణంతో విడిపోయేవాళ్లు మనలో చాలా మందే ఉంటారు. ఇక సెలబ్రిటీలకైతే ఇవన్నీ సర్వసాధారణం. వాళ్లకు ప్రేమలో పడటం ఎంత తేలికో...విడిపోవడం కూడా అంతే. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఫ్రిదా పింటో, దేవ్ పటేల్ ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆరేళ్ల నుంచి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరూ తమ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ-‘‘జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటికి దూరంగా పారిపోవడం పరిష్కారం కాదు. కానీ ఇప్పటికీ దేవ్ నాకు మంచి స్నేహితుడే. తను చాలా మంచి వ్యక్తి, నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అతనొకరు’’ అని చెప్పారు. -
ఇక దేవ్‌తో నటించను!
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేవ్ పటేల్, ఫ్రీదా పింటోకి మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్రీదా కన్నా దేవ్ దాదాపు ఐదేళ్లు చిన్నవాడు. అయినా, ప్రేమలో పడటానికి వీళ్లిద్దరూ వయసును పెద్ద విషయంగా తీసుకోలేదు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అనే విషయం పక్కన పెడితే.. ఇక ఇద్దరూ కలిసి నటించకూడదనుకుంటున్నారట. ‘‘తొలి కలయికలో రూపొందిన సినిమాలోనే కావాల్సినంత కెమిస్ట్రీ పండించేశాం. ఆ కెమిస్ట్రీని ఇక వ్యక్తిగత జీవితానికి అంకితం చేయాలనుకుంటున్నాం. అందుకే కలిసి నటించకూడదనుకున్నాం’’ అని పేర్కొన్నారు ఫ్రీదా. లాస్ ఏంజిల్స్‌లో దేవ్‌తో ఆమె సహజీవనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆ నగరంలో ఓ రెస్టారెంట్ ఆరంభించాలనుకుంటున్నానని ఫ్రీదా పింటో చెప్పారు.