
ఇక దేవ్‌తో నటించను!
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేవ్ పటేల్, ఫ్రీదా పింటోకి మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్రీదా కన్నా దేవ్ దాదాపు ఐదేళ్లు చిన్నవాడు. అయినా, ప్రేమలో పడటానికి వీళ్లిద్దరూ వయసును పెద్ద విషయంగా తీసుకోలేదు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అనే విషయం పక్కన పెడితే.. ఇక ఇద్దరూ కలిసి నటించకూడదనుకుంటున్నారట. ‘‘తొలి కలయికలో రూపొందిన సినిమాలోనే కావాల్సినంత కెమిస్ట్రీ పండించేశాం. ఆ కెమిస్ట్రీని ఇక వ్యక్తిగత జీవితానికి అంకితం చేయాలనుకుంటున్నాం. అందుకే కలిసి నటించకూడదనుకున్నాం’’ అని పేర్కొన్నారు ఫ్రీదా. లాస్ ఏంజిల్స్‌లో దేవ్‌తో ఆమె సహజీవనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆ నగరంలో ఓ రెస్టారెంట్ ఆరంభించాలనుకుంటున్నానని ఫ్రీదా పింటో చెప్పారు.