
తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ హాలీవుడ్‌కి హాయ్ చెప్పనున్నారు. ‘గూఢచారి’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నారామె. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ మూవీ ఫేమ్, బ్రిటన్ నటుడు దేవ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కే హాలీవుడ్ సినిమా ‘మంకీ మ్యాన్’ చిత్రంలో శోభితాకి అవకాశం దక్కింది.
దేవ్ పటేల్ దర్శకత్వం వహించనున్న మొదటి సినిమా ఇది. పాల్ అంగునావెలా, జాన్ కొలీ రచనా సహకారంతో దేవ్ పటేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. భారతదేశంలోని ముంబయ్ నగరం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని దేవ్ పటేల్ తెలిపారు. జైలు ఖైదీల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ సినిమా 2022లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment