Monkey Man In OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Monkey Man Movie Released In OTT, Streaming In USA And UK - Sakshi
Sakshi News home page

Monkey Man Movie OTT Release: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైపోయిన క్రేజీ యాక్షన్ మూవీ

Published Tue, Apr 23 2024 1:37 PM | Last Updated on Tue, Apr 23 2024 4:25 PM

Monkey Man Movie OTT Release Streaming In USA And UK - Sakshi

మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ హాలీవుడ్‌ చి‍త్రం.. గత నెలలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. కావాల్సింది. కానీ సెన్సార్ ఇబ్బందుల వల్ల భారత్ తప్ప అన్నిచోట్ల కూడా విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. మనోళ్లు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తుండగా.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విషయం సర్‌ప్రైజ్ చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు ఉంది.

'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దేవ్ పటేల్.. ఆ తర్వాత హాలీవుడ్‌లో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇతడే 'మంకీ మ్యాన్' మూవీతో దర్శకుడిగానూ మారాడు. ఇందులో హీరోగానూ చేశాడు. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ మూవీని పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీశాడు. ఫైట్స్ లాంటివి ఇష్టపడే ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చూడొచ్చు.

(ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్)

ఇకపోతే సెన్సార్ ఇబ్బందుల వల్ల 'మంకీ మ్యాన్' మూవీ మన దేశంలో రిలీజ్ కాలేదు. ఇంకెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్న టైంలో అమెజాన్ ప్రైమ్‌, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే భారతీయ ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతానికైతే రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

'మంకీ మ్యాన్' కథ విషయానికొస్తే.. ముంబైని పోలినట్లు యాతనా అనే సిటీ ఉంటుంది. ఇక్కడ ఉండే హీరో.. రాత్రిపూట కోతి మాస్క్ వేసుకుని మల్లయుద‍్ధ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. ఇతడికి ప్రత్యేకంగా పేరేం ఉండదు. ఇతడు.. ఓ అమ్మాయిని వ్యభిచారం నుంచి రక్షించేందుకు క్రూరుడైన పోలీస్ అధికారిని ఎదుర్కొంటాడు. హీరోకి పోలీస్ ఆఫీసర్‌కి గతంలో ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఇందులో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కూడా నటించింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ రెండు కాస్త స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement