Monkey Man
-
ఆర్ఆర్ఆర్ చాలా నచ్చింది.. ఆ హీరోతో పని చేయాలనుంది: హాలీవుడ్ డైరెక్టర్
హాలీవుడ్ దర్శకరచయిత ఫిలిప్ నోయిస్ డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ ఫాస్ట్ చార్లీ. ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడిది ఇండియాలోనూ రిలీజ్ కావడంతో ఇక్కడి మీడియాకు వరుస ఇంటర్వ్యూలిస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'ఇండియన్ సినిమాకు నేను పెద్ద అభిమానిని. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ మూవీ చూశాను. అది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప విజయం సాధించింది. అలాగే దేవ్ పటేల్ దర్శకత్వం వహించడంతో పాటు యాక్ట్ చేసిన మంకీ మాన్ కూడా బాగా నచ్చింది.ఆల్‌టైం ఫేవరెట్..ఈ ఏడాది ఇదే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మంకీమాన్ చిత్రంలో కథ చెప్పే విధానం కాస్త ఆర్ఆర్ఆర్ మాదిరిగా ఉంటుంది. సత్యజిత్ రే తీసిన పాతర్ పాంచాలి నా ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. బాల్యంలో ఉన్నప్పుడు ఆ సినిమా నన్ను ఎంతగానో కదిలించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో గొప్ప ఇండియన్ సినిమాలున్నాయి. ఓటీటీల పుణ్యమాని వాటిని ఎంచక్కా డిజిటల్ ప్లాట్ఫామ్లో చూడొచ్చు. నేను ఇండియాలో సినిమా తీయాల్సి వస్తే దాన్ని గౌరవంగా భావిస్తాను. హీరో షారుక్ ఖాన్‌తో పని చేయాలని ఉంది. వారి బ్లడ్‌లోనే ఉందిఇక్కడ తీసే అద్భుతమైన సినిమాలు కొన్ని బయట దేశాల్లో విడుదల కావడం లేదు. ప్రపంచ ప్రేక్షకుల్ని మీ వైపు తిప్పుకోవాలంటే ఇంకాస్త కష్టపడాల్సి ఉంది. ఇండియన్ ప్రేక్షకులు ఎమోషన్స్‌ను బయటకు చూపిస్తారు. సినిమాలో లీనమైపోతారు. వారి రక్తంలోనే సినిమా అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు' అని చెప్పుకొచ్చాడు. కాగా ఫిలిప్ నోయిస్ .. న్యూస్ఫ్రంట్, హీట్‌వేవ్, డెడ్ కామ్, ద క్వైట్ అమెరికన్, రాబిట్ ప్రూఫ్ ఫెన్స్, ద గీవర్, ద డెస్పరేట్ అవర్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.చదవండి: నా బయోపిక్‌లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా.. -
Monkey Man In OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ హాలీవుడ్ చిత్రం.. గత నెలలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. కావాల్సింది. కానీ సెన్సార్ ఇబ్బందుల వల్ల భారత్ తప్ప అన్నిచోట్ల కూడా విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. మనోళ్లు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తుండగా.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విషయం సర్ప్రైజ్ చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు ఉంది. 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దేవ్ పటేల్.. ఆ తర్వాత హాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇతడే 'మంకీ మ్యాన్' మూవీతో దర్శకుడిగానూ మారాడు. ఇందులో హీరోగానూ చేశాడు. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ మూవీని పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తీశాడు. ఫైట్స్ లాంటివి ఇష్టపడే ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చూడొచ్చు. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) ఇకపోతే సెన్సార్ ఇబ్బందుల వల్ల 'మంకీ మ్యాన్' మూవీ మన దేశంలో రిలీజ్ కాలేదు. ఇంకెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్న టైంలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే భారతీయ ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతానికైతే రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. 'మంకీ మ్యాన్' కథ విషయానికొస్తే.. ముంబైని పోలినట్లు యాతనా అనే సిటీ ఉంటుంది. ఇక్కడ ఉండే హీరో.. రాత్రిపూట కోతి మాస్క్ వేసుకుని మల్లయుద్ధ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. ఇతడికి ప్రత్యేకంగా పేరేం ఉండదు. ఇతడు.. ఓ అమ్మాయిని వ్యభిచారం నుంచి రక్షించేందుకు క్రూరుడైన పోలీస్ అధికారిని ఎదుర్కొంటాడు. హీరోకి పోలీస్ ఆఫీసర్‌కి గతంలో ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఇందులో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కూడా నటించింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ రెండు కాస్త స్పెషల్) -
కాల్ గర్ల్‌గా నటించడం గౌరవంగా ఉందన్న శోభిత (ఫోటోలు)
-
‘ఎస్ఎక్స్డబ్ల్యు’ లో ‘మంకీ మేన్’.. తెలుగు అమ్మాయిపై ప్రశంసలు
పట్టుమని పదే సినిమాల్లో నటించిన ఒక ఆర్టిస్ట్‌కి హాలీవుడ్ చాన్స్ వస్తే... పట్టరానంత ఆనందం కలుగుతుంది. హాలీవుడ్ చిత్రం ‘మంకీ మేన్’కి అవకాశం వచ్చినప్పుడు తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళకు అలాంటి ఆనందమే దక్కింది. పైగా ఈ చిత్రానికి ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ నటుడు దేవ్ పటేల్ డైరెక్టర్ కావడం, హనుమంతుని పురాణం స్ఫూర్తిగా రూపొందడంతో మంచి అవకాశంగా భావిస్తున్నారు శోభిత. ఇటీవల యూఎస్‌లోని ఆస్టిన్‌లో జరిగే ప్రతిష్టాత్మక ‘ఎస్ఎక్స్డబ్ల్యు’ (సౌత్ బై సౌత్‌వెస్ట్)లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఈ ప్రీమియర్‌కి హాజరైన శోభితా ధూళిపాళ మాట్లాడుతూ – ‘‘ఈ వరల్డ్ ప్రీమియర్‌లో మా సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అరుపులు, చప్పట్లతో నినాదాలు చేశారు. స్టాండింగ్ ఒవేషన్తోనూ ప్రశంసించారు. దేవ్ పటేల్‌కి డైరెక్టర్‌గా ఇది ఫస్ట్ మూవీ. హాలీవుడ్లో నాకు ఇది ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలో నాది పెద్ద భాగం కానప్పటికీ, వేరే భాషలో నటించడం, అది కూడా దేవ్ పటేల్ విజన్‌లో నేను భాగం కావడం చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. ఇక పలువురు హాలీవుడ్ తారలతో పాటు విపిన్ శర్మ, అశ్వినీ కల్సేఖర్, మకరంద్ దేశ్‌పాండే వంటి భారతీయ తారలు నటించిన ‘మంకీ మేన్’ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.