హాలీవుడ్ దర్శకరచయిత ఫిలిప్ నోయిస్ డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ ఫాస్ట్ చార్లీ. ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడిది ఇండియాలోనూ రిలీజ్ కావడంతో ఇక్కడి మీడియాకు వరుస ఇంటర్వ్యూలిస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'ఇండియన్ సినిమాకు నేను పెద్ద అభిమానిని. ఆ మధ్య ఆర్‌ఆర్‌ఆర్ మూవీ చూశాను. అది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప విజయం సాధించింది. అలాగే దేవ్ పటేల్ దర్శకత్వం వహించడంతో పాటు యాక్ట్ చేసిన మంకీ మాన్ కూడా బాగా నచ్చింది.
ఆల్‌టైం ఫేవరెట్..
ఈ ఏడాది ఇదే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మంకీమాన్ చిత్రంలో కథ చెప్పే విధానం కాస్త ఆర్‌ఆర్‌ఆర్ మాదిరిగా ఉంటుంది. సత్యజిత్ రే తీసిన పాతర్ పాంచాలి నా ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. బాల్యంలో ఉన్నప్పుడు ఆ సినిమా నన్ను ఎంతగానో కదిలించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో గొప్ప ఇండియన్ సినిమాలున్నాయి. ఓటీటీల పుణ్యమాని వాటిని ఎంచక్కా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు. నేను ఇండియాలో సినిమా తీయాల్సి వస్తే దాన్ని గౌరవంగా భావిస్తాను. హీరో షారుక్ ఖాన్‌తో పని చేయాలని ఉంది.
వారి బ్లడ్‌లోనే ఉంది
ఇక్కడ తీసే అద్భుతమైన సినిమాలు కొన్ని బయట దేశాల్లో విడుదల కావడం లేదు. ప్రపంచ ప్రేక్షకుల్ని మీ వైపు తిప్పుకోవాలంటే ఇంకాస్త కష్టపడాల్సి ఉంది. ఇండియన్ ప్రేక్షకులు ఎమోషన్స్‌ను బయటకు చూపిస్తారు. సినిమాలో లీనమైపోతారు. వారి రక్తంలోనే సినిమా అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు' అని చెప్పుకొచ్చాడు. కాగా ఫిలిప్ నోయిస్ .. న్యూస్‌ఫ్రంట్, హీట్‌వేవ్, డెడ్ కామ్, ద క్వైట్ అమెరికన్, రాబిట్ ప్రూఫ్ ఫెన్స్, ద గీవర్, ద డెస్పరేట్ అవర్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
చదవండి: నా బయోపిక్‌లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా..
Comments
Please login to add a commentAdd a comment