
తెలుగు హీరోయిన్ శోభితా దూళిపాళ్ల హాలివుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆమె ఇప్పటికే తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. స్లమ్‌డాగ్ మిలియనీర్ మూవీ ఫేం, బ్రిటన్ నటుడు దేవ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కే ‘మంకీ మాన్’ చిత్రంలో శోభితా నటించనున్నారు. దేవ్ పటేల్ దర్శకతం వహిస్తున్న మొదటి సినిమా ఇది. ఇటీవల ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ సొంతం చేసుకుంది. పాల్ అంగునావెలా, జాన్ కొలీ రచన సహాకారంతో దేవ్ పటేల్ ఈ చిత్రానికి తెరకెక్కించనున్నారు. ఇందులో దేవ్ పటేల్‌తో పాటు షార్ల్టో కోప్లీ, సికందర్ ఖేర్ నటించనున్నారు. ఈ సినిమా 2022లో విడుదల కానుంది.
చివరగా శోభతా ‘ఘోస్ట్ స్టోరీస్’లో కనిపించిన విషయం తెలిసిందే. ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్‌సిరీస్ ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. తెలుగులో తన మొదటి సినిమా ‘గూఢచారి’. ఆమె అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’లో నటిస్తోంది. ‘మంకీ మాన్’ చిత్రం భారతదేశంలోని ముంబై నగరం ఆధారం తెరకెక్కనుందని దేవ్ పటేల్ తెలిపారు. ఎందుకంటే తాను భారతదేశం నుంచి ప్రేరణ పోందినట్లు చెప్పారు. జైలు ఖైదీల నేపథ్యమున్న థ్రిల్లర్ మూవి ‘మంకీ మాన్’ అని తెలిపారు.
చదవండి: కలలో కూడా అనుకోలేదు: శోభితా దూళిపాళ్ల
Comments
Please login to add a commentAdd a comment