చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలి: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు | Krishna Vamsi Want To Work With Chiranjeevi | Sakshi
Sakshi News home page

నాగార్జున నా ఫేవ‌రెట్‌, చిరంజీవితో సినిమా చేయాలి

Published Sat, Oct 30 2021 7:06 PM | Last Updated on Sat, Oct 30 2021 7:10 PM

Krishna Vamsi Want To Work With Chiranjeevi - Sakshi

'గులాబి', 'నిన్నే పెళ్లాడుతా', 'అంతఃపురం', 'ఖ‌డ్గం', 'రాఖీ' వంటి సినిమాల‌తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ద‌ర్శ‌కుడు కృష్ణ వంశీ. జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుతో పాటు నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న  ఈ ద‌ర్శ‌కుడు కొంత‌కాలంగా ఫాంలో లేరు. దీంతో  రంగ‌మార్తాండ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాల‌ని చూస్తున్నాడీ డైరెక్ట‌ర్‌. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు.

'నాగార్జున నా ఫేవ‌రెట్ హీరో.. మెగాస్టార్‌ చిరంజీవితో రెండు, మూడు సినిమాల‌నుకున్నాం, కానీ కుద‌ర‌లేదు. ఆయ‌న‌తో ఒక్క సినిమా అయినా చేయాలి. రంగ‌మార్తాండ సినిమా షూటింగ్ ఇంకా ప‌ది రోజులు మిగిలే ఉంది. ఈ సినిమాలో కొత్త‌ బ్ర‌హ్మానందాన్ని చూస్తారు. అలాగే ర‌మ్య‌కృష్ణలో కొత్త కోణాన్ని చూస్తారు. రంగ‌మార్తాండ సినిమా షూట్ కంప్లీట్ అవ‌గానే అన్నం సినిమా ప్రీపొడ‌క్ష‌న్ మొద‌ల‌వుతుంది. త‌ర్వాత మ‌రో ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. రంగ‌మార్తాండ థియేట‌ర్‌లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. మ‌రి ఇది ఓటీటీలోకి వ‌స్తుందా? థియేట‌ర్‌లో రిలీజ్ అవుతుందా? అన్నది ఇప్పుడే చెప్ప‌లేం' అని చెప్పుకొచ్చారు కృష్ణ వంశీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement