ఆ సినిమా కోసం చిరంజీవి 'షాయరీ' | Chiranjeevi Shayari In Krishna Vamsi Rangamarthanda | Sakshi
Sakshi News home page

Chiranjeevi Shayari: షాయరీ వినిపించనున్న మెగాస్టార్‌ చిరంజీవి..

Published Wed, Jun 29 2022 7:52 AM | Last Updated on Wed, Jun 29 2022 8:04 AM

Chiranjeevi Shayari In Krishna Vamsi Rangamarthanda - Sakshi

Chiranjeevi Shayari In Krishna Vamsi Rangamarthanda: మెగాస్టార్‌ చిరంజీవి షాయరీ వినిపించనున్నారు. షాయరీ అంటే.. మాటా కాదు.. అలా అని పాటా కాదు. ఒక కవితాత్మకమైన ధోరణిలో చెప్పేది. ఇంతకీ చిరంజీవి షాయరీ ఎందుకు చెప్పారంటే 'రంగ మార్తాండ' చిత్రం కోసం. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక నటుడి జీవితం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. 

ఆ నటుడు తన జీవితంలో ఎదుర్కొనే ఘటనలు, అతని భావోద్వేగాలు ఇవన్నీ చెప్పాలంటే.. 30 ఏళ్లకుపైగా నటనానుభవం ఉన్న చిరంజీవి అయితే బాగుంటుందని కృష్ణవంశీ భావించారట. ఆ నటుడి తాలుకూ భావోద్వేగాన్ని షాయరీ రూపంలో చెబితే ప్రేక్షకుల మనసులను తాకొచ్చని అనుకున్నారట. ఇప్పటివరకూ చిరంజీవి పలు చిత్రాలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినప్పటికీ షాయరీ చెప్పలేదు. అందుకే కృష్ణవంశీ షాయరీ గురించి చెప్పగానే చిరంజీవి ఎగ్జయిట్‌ అయి, ఓకే అన్నారట. 

(చదవండి: తెరపైకి అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ..)

ఇటీవలే ఈ షాయరీని రికార్డ్‌ చేశారని, ఒక రోజులేనే చిరంజీవి చెప్పారని తెలిసింది. 'రంగ మార్తాండ'కు మెగాస్టార్‌ చెప్పిన ఈ షాయరీ కచ్చితంగా హైలెట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించనున్నారు. 

(చదవండి: పాడె మోసి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్‌గా పోస్ట్‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement