నక్షత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ | Nakshathram Movie release Date | Sakshi
Sakshi News home page

నక్షత్రం రిలీజ్ డేట్ ఫిక్స్

Published Sun, Jul 16 2017 1:35 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

నక్షత్రం రిలీజ్ డేట్ ఫిక్స్

నక్షత్రం రిలీజ్ డేట్ ఫిక్స్

కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ, తాజాగా నక్షత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు.

ముందుగా ఈ సినిమాను ఈ నెల 21న రిలీజ్ చేయాలని భావించినా.. అదే రోజు మరో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫిదా రిలీజ్ అవుతుండటంతో ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 28న నక్షత్రం రిలీజ్ అంటూ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫెయిల్యూర్స్తో ఇబ్బంది పడుతున్న సాయి, సందీప్, కృష్ణ వంశీల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement