నక్షత్రం లోగో లాంచ్ చేసిన చెర్రీ | Ram Charan unveils Krishna vamsi Nakshatram logo | Sakshi
Sakshi News home page

నక్షత్రం లోగో లాంచ్ చేసిన చెర్రీ

Published Sat, Oct 8 2016 2:07 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

నక్షత్రం లోగో లాంచ్ చేసిన చెర్రీ

నక్షత్రం లోగో లాంచ్ చేసిన చెర్రీ

గతంలో ప్రకటించినట్టుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నక్షత్రం చిత్ర టైటిల్ లోగో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్, తన సెట్స్ నుంచి ఈ సినిమా లోగోను రిలీజ్ చేశారు. నక్షత్రం చిత్ర దర్శకుడు కృష్ణవంశీతో గతంలో రామ్ చరణ్ హీరోగా 'గోవిందుడు అందరివాడేలే' సినిమాను తెరకెక్కించాడు. ఆ స్నేహంతోనే చెర్రీ కృష్ణవంశీ సినిమా లుక్స్ను రిలీజ్ చేసేందుకు అంగీకరించాడు.

సందీప్ కిషన్, రెజీనాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో సాయి ధరమ్ తేజ్, ప్రగ్యాజైస్వాల్లు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పది లుక్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన కృష్ణవంశీ అన్ని లుక్స్ను రామ్ చరణ్ చేతులు మీదుగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను శ్రీనివాసులు, సజ్జు, వేణుగోపాల్ లు నిర్మిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement