నక్షత్రానికి చరణ్ సాయం | Ram Charan releasing Nakshathram Ten Looks | Sakshi
Sakshi News home page

నక్షత్రానికి చరణ్ సాయం

Published Sun, Sep 4 2016 11:10 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

నక్షత్రానికి చరణ్ సాయం

నక్షత్రానికి చరణ్ సాయం

రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే లాంటి డీసెంట్ హిట్ తెరకెక్కించిన కృష్ణవంశీ, తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా చరణ్ సాయం తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం సినిమాను తెరకెక్కిస్తున్నాడు కృష్ణవంశీ. తనను ఫ్యామిలీ ఆడియన్స్కు చేరువ చేసిన కృష్ణ వంశీ కోసం తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు చెర్రీ.

ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నక్షత్రం సినిమాకు సంబందించిన పది లుక్స్ను రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నక్షత్రం చిత్ర అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ప్రకటించారు. అయితే ఈ లుక్స్ను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ పోలీస్ ఆఫీసర్గా అతిథి పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement