అమ్మడికి అవకాశాలే లేవట..! | Regina Cassandra has only one Telugu film in her hand | Sakshi
Sakshi News home page

అమ్మడికి అవకాశాలే లేవట..!

Published Mon, Nov 28 2016 12:32 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

అమ్మడికి అవకాశాలే లేవట..!

అమ్మడికి అవకాశాలే లేవట..!

ఎస్ఎమ్ఎస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రెజీనా. కెరీర్ స్టార్టింగ్లో కమర్షియల్ సక్సెస్లు సాధించలేకపోయినా.. నటిగా మాత్రం మంచి మార్కులే సాధించింది. రవితేజ సరసన హీరోయిన్గా నటించిన పవర్ సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకున్న రెజీనా.. తరువాత ఆ ఫాంను కంటిన్యూ చేయలేకపోయింది. కెరీర్లో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద లాంటి హిట్ సినిమాలు ఉన్నా.. వరుస అవకాశాలు మాత్రం పలకరించటం లేదు.

తమిళ్లో కాస్త పరవాలేదని పించినా.. టాలీవుడ్లో మాత్రం అమ్మడు ఆశించిన స్ధాయిలో రాణించటం లేదు. జ్యో అచ్యుతానంద తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది రెజీనా. ఈ సినిమా తరువాత తెలుగులో ఒక్క సినిమా కూడా అమ్మడి చేతిలో లేదు. తనతో పాటు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నాలు టాలీవుడ్లో జోరు చూపిస్తుంటే, రెజీనా మాత్రం కోలీవుడ్ ఆఫర్లతో సరిపెట్టుకుంటోంది. అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన పెద్దగా వర్క్ అవుట్ అయినట్టుగా లేదు. అయితే ఇలాంటి సమయంలో బాలీవుడ్ లో చేస్తున్న సినిమా రెజీనాకు కెరీర్ మీద ఆశలు కల్పిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement