మూడోసారి జోడి కడుతున్నారు
మూడోసారి జోడి కడుతున్నారు
Published Fri, May 6 2016 8:41 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM
ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్లు రిపీట్ అవ్వటం కామన్. అయితే ఈ ఫార్ములాను బ్రేక్ చేస్తూ ఇప్పటికే రెండు ఫ్లాప్లు ఇచ్చిన కాంబినేషన్ను మరోసారి తెర మీదకు తీసుకు రావడానికి రెడీ అవుతున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. బాలయ్య వందో సినిమాతో పాటు, రుద్రాక్ష సినిమా కూడా చేజారిపోవటంతో ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్తో నక్షత్రం అనే సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు కృష్ణవంశీ.
ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం కృష్ణవంశీ ఓ రిస్కీ కాంబినేషన్ను సెట్ చేస్తున్నాడట. నక్షత్రం సినిమాలో సందీప్ కిషన్ సరసన రెజీనాను హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడు. గతంలో సందీప్ కిషన్, రెజీనాలు రెండు సినిమాల్లో కలిసి నటించగా ఆ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
తొలిసారి రొటీన్ లవ్ స్టోరి సినిమాలో కలిసి నటించిన ఈ జంట మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకున్నా సినిమా రిజల్ట్ మాత్రం నిరాశపరిచింది. ఆ తరువాత కొత్త దర్శకుడితో రారా కృష్ణయ్య సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ సినిమా కూడా రిలీజ్కు ముందు మంచి హైప్ క్రియేట్ చేసినా తరువాత మాత్రం ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. దీంతో ఇదే కాంబినేషన్లో సినిమా చేయటం కృష్ణవంశీకి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సెంటిమెంట్ను బ్రేక్ చేసి హిట్ కొడతాడేమో చూడాలి.
Advertisement
Advertisement