గణేశ్‌ని చాలామంది భయపెట్టారు | Ganesh Many people threatened | Sakshi
Sakshi News home page

గణేశ్‌ని చాలామంది భయపెట్టారు

Published Sat, Oct 11 2014 1:09 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

గణేశ్‌ని చాలామంది భయపెట్టారు - Sakshi

గణేశ్‌ని చాలామంది భయపెట్టారు

 - కృష్ణవంశీ
‘‘ప్రస్తుతం మాస్, కామెడీ.. అంటూ విచిత్రమైన ధోరణిలోనే ఎక్కువ శాతం సినిమాలుంటున్నాయి. పైగా కెరీర్‌పరంగా ఈ మధ్య చాలా దిగువ స్థాయిలో ఉన్న నాలాంటి దర్శకుడు ఈ కథ చెబితే చేయడానికి గట్స్  కావాలి. మొదట్నుంచీ చివరి వరకు చరణ్‌కు ఈ కథపై నమ్మకం తగ్గలేదు’’ అని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మించిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం విజయోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా చేద్దామనుకున్నప్పుడు, ‘మనం మంచి సినిమా చేయాలి, ఇలాంటి చిత్రాలకు పరుచూరి బ్రదర్స్ ఉంటే బాగుంటుంది’ అని అన్నయ్య (చిరంజీవి) అన్నారు.

ఆయన సలహా మేరకు పరుచూరి బ్రదర్స్‌తో వర్క్ చేశాం. ఏ చిత్రానికైనా నిర్మాత సహకారం లేకపోతే సరిగ్గా చేయలేం. ఈ సినిమాకు చరణ్ తర్వాత హీరో బండ్ల గణేశే. నాతో సినిమా అన్న తర్వాత గణేశ్‌ని చాలామంది చాలా రకాలుగా భయపెట్టారు. కానీ, దేనికీ భయపడకుండా, సినిమాకు ఏది అవసరమో అది సమకూర్చారు. ఇక, ఈ చిత్రంలోని ‘రా రాకుమారా..’ పాట గురించైతే ‘మీరీ పాట కాజల్ కోసమే తీశారు. తనకు 11 షాట్స్.. నాకు 2 షాట్సా’ అంటూ చరణ్ సరదాగా చిన్నపాటి అలక కూడా ప్రదర్శించాడు’’ అని చెప్పారు.

బండ్ల గణేశ్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకి లిటిల్ బాస్ (రామ్‌చరణ్) ఇచ్చిన సహకారం మరువలేనిది. కృష్ణవంశీ మన తెలుగువాడు కావడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. దర్శకుడికి స్వేచ్ఛ ఇస్తే సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. ఇందులో ప్రకాశ్‌రాజ్ స్థానంలో వేరే నటుణ్ణి ఊహించలేం’’ అన్నారు. ఈ వేడుకలో శ్రీకాంత్, పరుచూరి బ్రదర్స్, కోట శ్రీనివాసరావు, కాజల్ అగర్వాల్, సమీర్ ఆదర్స్ తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement