'నక్షత్రం'లో మరో స్టార్ | Pragya Jaiswal learnt martial arts, kick-boxing for Nakshatram | Sakshi
Sakshi News home page

'నక్షత్రం'లో మరో స్టార్

Published Wed, Aug 17 2016 3:17 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

'నక్షత్రం'లో మరో స్టార్

'నక్షత్రం'లో మరో స్టార్

కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ నక్షత్రం. యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దాదాపు 20 నిమిషాల పాటు కనిపించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు సాయి. తాజాగా ఈ నక్షత్రానికి మరో మెరుపు యాడ్ అయ్యింది.

జాతీయ అవార్డ్ సాధించిన కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ప్రగ్యా జైస్వాల్ కూడా నక్షత్రం సినిమాలో నటిస్తోంది. సందీప్ కిషన్కు జోడిగా రెజీనా నటిస్తుండగా ప్రగ్యా కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుందట. అంతేకాదు ఈ సినిమాలో సందీప్తో పోరాడే ఓ భారీ యాక్షన్ సీన్లోనూ నటిస్తోంది ప్రగ్యా జైస్వాల్. ఈ సీన్స్ కోసం కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ లాంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. మరి ఇంత భారీగా రూపొందుతున్న నక్షత్రం అయినా కృష్ణవంశీకి గత వైభవాన్ని తీసుకువస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement