కట్‌ చేస్తే... టచ్‌ చేసి చూడు | Pragya Jaiswal select to raviteja movie | Sakshi
Sakshi News home page

కట్‌ చేస్తే... టచ్‌ చేసి చూడు

Published Mon, Apr 24 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

కట్‌ చేస్తే... టచ్‌ చేసి చూడు

కట్‌ చేస్తే... టచ్‌ చేసి చూడు

‘కంచె’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’... చేసింది మూడు చిత్రాలే అయినా అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రగ్యా జైస్వాల్‌. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నక్షత్రం’ చిత్రంలో నటిస్తోన్న ఈ బ్యూటీకి తాజాగా మాస్‌ మహారాజ రవితేజ సరసన నటించే బంపర్‌ ఆఫర్‌ వరించిందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

విక్రమ్‌ సిరికొండను దర్శకునిగా పరిచయం చేస్తూ నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మంచనున్న ‘టచ్‌ చేసి చూడు’. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా రాశీఖన్నాను ఎంపిక చేయగా, రెండో కథానాయికగా ప్రగ్యాను తీసుకున్నారని తెలుస్తోంది. సెకండ్‌ హీరోయిన్‌గా లావణ్యా త్రిపాఠి పేరు వినిపించినా.. కట్‌ చేస్తే.. ఫైనల్‌గా ఆ అవకాశం ప్రగ్యాకు దక్కిందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement