షూటింగ్లో ప్రమాదం, హీరోకు గాయాలు | Sandeep Kishan Injured on Sets in shooting of Nakshatram | Sakshi
Sakshi News home page

షూటింగ్లో ప్రమాదం, హీరోకు గాయాలు

Published Thu, Jun 16 2016 8:24 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

షూటింగ్లో ప్రమాదం, హీరోకు గాయాలు - Sakshi

షూటింగ్లో ప్రమాదం, హీరోకు గాయాలు

ఒక్క అమ్మాయి తప్ప సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్, గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. తొలిసారిగా కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్ తో కలిసి నక్షత్రం సినిమాలో నటిస్తున్నాడు సందీప్. బుధవారం ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజునే యాక్షన్ సీన్స్ షూటింగ్ ప్రారంభించగా.. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో సందీప్ తలకు బలమైన గాయం తగలడంతో యూనిట్ సభ్యులు వెంటనే అతన్ని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన పై స్పందించిన హీరో సందీప్ కిషన్ 'ఇప్పుడు బాగానే ఉంది. కొన్ని కుట్లు పడ్డాయి. కృష్ణవంశీ గారి సెట్ లో యాక్షన్ సీన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కానీ సీన్ చాలా బాగా వచ్చినందకు ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement