కరోనా తర్వాత జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. దీంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ కోసం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్ కోసం బాగానే ఖర్చు చేస్తున్నాయి. తెలుగులో కూడా పదుల సంఖ్యల్లో వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. వీటి కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్నారు. పేరున్న చాలా మంది దర్శకులు వెస్ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కృష్ణ వంశీ కన్ను కూడా వెబ్ సిరీస్‌లపై పడింది.
(చదవండి: హిట్టు కోసం అలా చేయడం నాకు చేతకాదు : కృష్ణవంశీ)
త్వరలోనే ఆయన కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడట. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఓటీటీ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు.‘వచ్చే ఏడాదిలో ఓటీటీ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది. 200–300 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. స్టార్సే ఉండాలని రూల్ కూడా లేదు. సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు’అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. మరి కృష్ణవంశీ చేయబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఓటీటీ రంగంలో ఎలాంటి రికార్టు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘రంగ మార్తాండ’అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
మరాఠీ సూపర్ హిట్ ‘నట సామ్రాట్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ‘అన్నం’చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment