రైతు సమస్యలపై బాలకృష్ణ పోరాటం | Bala krishna 100th movie title Rythu r Rythu Rajyam | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై బాలకృష్ణ పోరాటం

Published Fri, Mar 4 2016 1:55 PM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

రైతు సమస్యలపై బాలకృష్ణ పోరాటం

రైతు సమస్యలపై బాలకృష్ణ పోరాటం

99 సినిమాలు పూర్తి చేసుకున్ననందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన వందో సినిమా మీద దృష్టిపెట్టాడు. ఈ సినిమా రేసులో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఫైనల్గా సీనియర్ దర్శకుడు కృష్ణవంశీకే ఫిక్స్ అయ్యాడు బాలయ్య. బాలకృష్ణతో చేయబోయే సినిమా కోసం రుద్రాక్ష సినిమాను పక్కన పెట్టి మరీ కథను రెడీ చేసేపనిలో పడ్డాడు కృష్ణవంశీ. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట.

ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా బాలయ్య వందో సినిమా కృష్ణవంశీతోనే అంటూ టాలీవుడ్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కనుందని టాక్. ఈ సినిమా కోసం రైతు, లేదు రైతు రాజ్యం అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటనతో పాటు టైటిల్ను కూడా ఎనౌన్స్ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement