'వందో సినిమా క్రిష్ లేదా కృష్ణవంశీతో' | Balakrishna shares his 100th film details with scribes | Sakshi
Sakshi News home page

'వందో సినిమా క్రిష్ లేదా కృష్ణవంశీతో'

Mar 8 2016 11:38 AM | Updated on Sep 3 2017 7:16 PM

'వందో సినిమా క్రిష్ లేదా కృష్ణవంశీతో'

'వందో సినిమా క్రిష్ లేదా కృష్ణవంశీతో'

లయన్ సినిమాతో 99 సినిమాలను పూర్తి చేసిన బాలయ్య, 100 సినిమాలో విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

లయన్ సినిమాతో 99 సినిమాలను పూర్తి చేసిన బాలయ్య, తన వందో సినిమాలో విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను తనకు వరుస సూపర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేద్దామని భావించినా బోయపాటి డేట్స్ ఖాళీ లేకపోవటంతో ఇతర దర్శకుల మీద దృష్టిపెట్టాడు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదిత్య 369కు సీక్వెల్ ప్లాన్ చేసినా, అది ఈ జనరేషన్ను మెప్పిస్తుందో లేదో అన్న ఆలోచనతో ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశాడు.

తాజాగా తన వందో సినిమా కోసం ఇద్దరు దర్శకులు, మంచి కథలతో రెడీగా ఉన్నారని నందమూరి బాలకృష్ణ స్వయంగా తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య, ఈ విషయాన్ని వెల్లడించారు. తన వందో సినిమా కోసం క్రిష్, కృష్ణవంశీ ఇద్దరూ కథలు సిద్ధం చేశారని, అయితే ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా చేయబోయేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లండిచాడు. ఈ ఇద్దరు దర్శకుల శైలి, రెగ్యులర్ సినిమాకు భిన్నమైనది కావటంతో బాలయ్య వందో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement