మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది | Began is a good time for me again :Naresh | Sakshi
Sakshi News home page

మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది

Published Wed, Jul 30 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది

మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది

 ‘‘హీరోగా చేస్తున్న రోజుల్లో కూడా నేను హీరోగా ఫీలవ్వలేదు. ఒక సాధారణ నటునిగానే ఫీలయ్యాను. అందుకే ఇప్పుడు ప్రత్యేక పాత్రలు పోషిస్తుంటే నాకు కొత్తగా ఏమీ అనిపించడం లేదు. నటనను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా’’ అన్నారు నరేశ్. దాదాపు ఇరవై ఏళ్ల పాటు కథానాయకునిగా వెలిగిన ఆయన... ప్రస్తుతం కేరక్టర్ నటునిగా బిజీగా ఉన్నారు.
 
 ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నరేశ్ విలేకరులతో ముచ్చటించారు.నటునికి టైమింగ్ ఉంటే సరిపోదు: నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలై నాలుగేళ్లు అవుతోంది. 2014 నాకు మంచి ఫలితాలనిస్తోంది. ‘దృశ్యం’ నాకు మంచి పేరు తెస్తోంది. సందీప్ కిషన్ హీరోగా కన్మణి దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే నితిన్-కరుణాకరన్ కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తున్నా. ‘లక్ష్మీ రావె మా ఇంటికి’లో కూడా నాది మంచి పాత్ర.
 
  అప్పట్లో రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల నా సినిమా కెరీర్ చాలా వరకూ దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ కావడం పునర్జన్మ వచ్చినట్లయ్యింది. నటునికి టైమింగ్ ఉంటే సరిపోదు. టైమ్ కూడా కలిసి రావాలి. మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది.మా అబ్బాయి హీరోగా వస్తున్నాడు: త్వరలోనే మా అబ్బాయి నవీన్ హీరోగా పరిచయం కానున్నాడు. కృష్ణవంశీ శిష్యుడు రామ్ ప్రసాద్ దర్శకత్వంలో అడ్డాల చంటి ఆ సినిమా నిర్మిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement