Lakshmi Raave Maa Intiki
-
బుల్లితెరపై... ‘లక్ష్మీ రావే మా ఇంటికి’
మార్చి 8, ఆదివారం నాడు మహిళా దినోత్సవం సందర్భంగా జీ-తెలుగు చానల్లో అదే రోజు సాయంత్రం 6 గంటలకు అవికా గోర్, నాగ శౌర్య జంటగా నటించిన చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ప్రసారం కానుంది. విజయనగరంలో ‘కొంచెం ఇష్టం - కొంచెం కష్టం’ రోహిణి, రేవతి, గౌతమ్ ఈ పేర్లు వింటే గుర్తొచ్చే సీరియల్ ‘కొంచెం ఇష్టం-కొంచెం కష్టం’ అని ప్రేక్షకులు ఠక్కున చెబుతారు. రోహిణి , రేవతి ఇద్దరూ గౌతమ్‌ను ప్రేమిస్తారు. కానీ వారిలో ఎవరికి గౌతమ్ దక్కనున్నాడో తెలియాలంటే మార్చి 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయనగరంలోని ఎం.ఆర్ కళాశాలలోని అయోధ్య మైదానంలో జరిగే చిత్రీకరణకు ప్రేక్షకులు హాజరు కావాలని ‘జీ -తెలుగు’ టీవీ చానల్ ప్రతినిధులు తెలిపారు. -
‘బొమ్మరిల్లు’లో...‘ఇడియట్’ కుర్రాణ్ణి!
‘‘ ‘బొమ్మరిల్లు’ లాంటి ఇంట్లోకి ‘ఇడియట్’ లాంటి కుర్రాడు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రంలో నా పాత్ర అలా ఉంటుంది’’ అంటున్నారు యువ హీరో నాగశౌర్య. నంద్యాల రవి దర్శకత్వంలో నాగశౌర్య, అవికా గోర్ జంటగా మామిడిపల్లి గిరిధర్ నిర్మించిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘ఇందులో అవికా గోర్‌ను ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అని పిలుస్తుంటాను. అందుకే... ఈ టైటిల్ పెట్టారనుకుంటా. కథంతా అవిక చుట్టూనే తిరుగుతుంది. నేనేమో ఆమె చుట్టూ తిరుగుతుంటాను. మా జంట ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది విడుదల అవుతున్న నా నాలుగో చిత్రమిది. ఇప్పటివరకూ విడుదలైన నా మూడు చిత్రాలూ విజయాలను అందుకున్నాయి. ఈ నాలుగో చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని ఆకాంక్షించారు నాగశౌర్య. తను పోషించిన పాత్ర గురించి వివరిస్తూ -‘‘తన తండ్రిని ఒప్పిస్తేనే మన పెళ్లి అని హీరోయిన్ షరతు పెడుతుంది. దీంతో హీరోయిన్ ఇంట్లోకి ప్రవేశించిన హీరో... వాళ్లను పెళ్లికి ఎలా ఒప్పించాడు అనేదే సినిమా. ఇందులో నేను పూర్తిగా ఎనర్జిటిక్‌గా ఉంటా. అలాగే నా పాత్రకు బాధ్యత కూడా ఉంటుంది. రవితేజకు ‘ఇడియట్’ ఎంతటి పేరు తెచ్చిందో, ఈ సినిమా నాకు అంతటి పేరు తెస్తుంది. నా గత చిత్రాలతో పోల్చి చూస్తే కచ్చితంగా ఇది కొత్త పాత్రే’’ అన్నారు నాగశౌర్య. -
రవితేజకు ‘ఇడియట్’లా...
‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు ఇలియానా. బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. తెలుగు సినిమాకు ఇక ఇలియానా దూరమైపోయినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో నాగశౌర్య, అవికా గోర్ జంటగా నంద్యాల రవి దర్శకత్వంలో మామిడిపల్లి గిరిధర్ నిర్మించిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ఆడియో వేడుకలో తళుక్కున మెరిశారు. ఆ సినిమాకు సంబందించిన ప్రచార చిత్రాలను ఆవిష్కరించారామె. ఈ చిత్ర నిర్మాత మామిడిపల్లి గిరిధర్ మంచి వ్యక్తి అనీ, ఈ వేడుక గొప్ప అనుభూతినిచ్చిందని ఇలియానా అన్నారు. కె.ఎం.రాధాకృష్ణన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను అవికా గోర్ తల్లి చేతన్గోర్ ఆవిష్కరించి నాగశౌర్య తల్లి ఉషకు అందించారు. నంద్యాల రవి మాట్లాడుతూ -‘‘కె.ఎం.రాధాకృష్ణన్ సంగీత విద్వాంసుడు. ఈ చిత్రానికి యాభై శాతం బలాన్ని ఆయనే ఇచ్చారు. దర్శకునిగా అవకాశమిచ్చిన గిరిధర్గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు. పాతికేళ్లుగా సినిమా జర్నలిస్ట్‌గా పనిచేసిన తాను అన్ని విషయాల్లోనూ విజయాలు సాధించాననీ, సినీ రంగంలో నిరూపించుకోవడమే తరువాయి అనుకున్నప్పుడు నిర్మాతగా మారాలని నిశ్చయించుకున్నాననీ, రవితేజకు ‘ఇడియట్’లా నాగశౌర్యకు ఈ చిత్రం నిలిచిపోతుందనీ, డిసెంబర్ 5న సినిమాను విడుదల చేస్తామనీ గిరిధర్ తెలిపారు. ఈ సినిమాలో నటించడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. అతిథులుగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్, సి.కల్యాణ్, శాసనసభ్యురాలు రేఖా నాయక్ ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది
‘‘హీరోగా చేస్తున్న రోజుల్లో కూడా నేను హీరోగా ఫీలవ్వలేదు. ఒక సాధారణ నటునిగానే ఫీలయ్యాను. అందుకే ఇప్పుడు ప్రత్యేక పాత్రలు పోషిస్తుంటే నాకు కొత్తగా ఏమీ అనిపించడం లేదు. నటనను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా’’ అన్నారు నరేశ్. దాదాపు ఇరవై ఏళ్ల పాటు కథానాయకునిగా వెలిగిన ఆయన... ప్రస్తుతం కేరక్టర్ నటునిగా బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నరేశ్ విలేకరులతో ముచ్చటించారు.నటునికి టైమింగ్ ఉంటే సరిపోదు: నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలై నాలుగేళ్లు అవుతోంది. 2014 నాకు మంచి ఫలితాలనిస్తోంది. ‘దృశ్యం’ నాకు మంచి పేరు తెస్తోంది. సందీప్ కిషన్ హీరోగా కన్మణి దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే నితిన్-కరుణాకరన్ కాంబినేషన్లో మరో సినిమా చేస్తున్నా. ‘లక్ష్మీ రావె మా ఇంటికి’లో కూడా నాది మంచి పాత్ర. అప్పట్లో రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల నా సినిమా కెరీర్ చాలా వరకూ దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ కావడం పునర్జన్మ వచ్చినట్లయ్యింది. నటునికి టైమింగ్ ఉంటే సరిపోదు. టైమ్ కూడా కలిసి రావాలి. మళ్లీ నాకు మంచి టైమ్ మొదలైంది.మా అబ్బాయి హీరోగా వస్తున్నాడు: త్వరలోనే మా అబ్బాయి నవీన్ హీరోగా పరిచయం కానున్నాడు. కృష్ణవంశీ శిష్యుడు రామ్ ప్రసాద్ దర్శకత్వంలో అడ్డాల చంటి ఆ సినిమా నిర్మిస్తున్నారు. -
లక్ష్మీరావే మా ఇంటికి మూవీ స్టిల్స్
-
లక్ష్మీ రావే మా ఇంటికి మూవీ స్టిల్స్