యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు టీజర్ ని లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హాజరైన టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
‘మా అమ్మ ఎప్పుడు చెప్పేది.. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కారణాలు అడ్డు వచ్చినా.. ఆ ప్రేమని చనిపోయింతవరకూ వదులుకోకూడదు’ అనే డైలాగ్ మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమకథని చాలా కొత్తగా, మనసుని హత్తుకునేలా చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేశాయి.
‘’ఆ రాముడు సీత కోసం ఒక్కసారే యుద్ధం చేశారు. కానీ నా సీత కోసం ప్రతిక్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నా’, ‘కాలిపోతున్న కాగితానికి ఎంత ప్రేమ చూపించినా తిరిగిరాదు’, ‘చందమామను చేరుకోవడం ఆ పావురానికి గమ్యం అయితే.. నిన్ను చేరుకోవడమే నా గమ్యం ధరణి’ అనే డైలాగ్స్ ప్రేమకథని డెప్త్ ని తెలియజేస్తున్నాయి. కృష్ణ వంశీ టీజర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మోక్ష అందం, అభినయంతో అలరించింది. దర్శకుడు ఆకాష్ రెడ్డి హార్ట్ టచ్చింగ్ లవ్ స్టొరీని ప్రజెంట్ చేస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. శశాంక్ అందించిన నేపధ్య సంగీతం మరింత ఆకర్షణగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment