
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అయిన సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. మోక్ష హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీతో వీరిద్దరూ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు.

‘అలనాటి రామచంద్రుడు’ సినిమా ఆగష్టు 2 విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. సుమారు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా సడెన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, కేశవ్ దీపక్, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రల్లో కనిపించారు.
కథేంటంటే..
సిద్ధు(కృష్ణ వంశీ) ఇంట్రోవర్ట్. చిన్నప్పటి నుంచి ఇతరులో మాట్లాడాలన్నా..స్టేజ్‌పై స్పీచ్ ఇవ్వాలన్నా చాలా భయం. ధరణి(మోక్ష) ఎక్స్‌ట్రావర్ట్. ఒంటరిగా ఉన్నా..తనచుట్టు నలుగురు పోగయ్యేలా చేసే రకం. ఇద్దరిది ఒకే కాలేజీ. తనకు పూర్తి భిన్నంగా ఉన్న ధరణి అంటే సిద్ధుకి చాలా ఇష్టం. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక..తన మెమెరీస్‌ని రికార్డు చేసి క్యాసెట్ల రూపంలో దాచుకుంటాడు. దరణితో స్నేహం ఏర్పడినా తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి భయపడిపోతాడు. ఓ రోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటాడు.

అంతలోనే ధరణికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని..అతని పేరు విక్రమ్(సుప్రజ్) అని తెలుస్తుంది. ఆ తర్వాత సిద్దు ఏం చేశాడు? అసలు ధరణికి విక్రమ్ ఎలా పరిచయం అయ్యాడు? విక్రమ్‌తో కలిసి మనాలి వెళ్లాలనుకున్న దరణి..ఒంటరిగానే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సిద్దు మనాలి ఎందుకు వెళ్లాడు? ధరణి గతం మర్చిపోవడానికి గల కారణం ఏంటి? అసలు సిద్ధు తన ప్రేమ విషయాన్ని ధరణికి చెప్పాడా?లేదా? చివరకు సిద్దు, ధరణిలు ఎలా కలిశారు? అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment