టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ బ్రాండ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు కృష్ణ వంశీ. నక్షత్రం మూవీ తర్వాత ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్ గా కృష్ణ వంశీ రంగమార్తాండ తెరకెక్కించాడు. నటసామ్రాట్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఇక్కడ ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. కరోనా కి ముందు మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న రంగమార్తాండ మార్చి 22న విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో కృష్ణవంశీ ప్రేక్షకులను మెప్పించగలడా అనే సందేహాలు టీటౌన్‌లో వినిపిస్తున్నాయి.
కృష్ణవంశీ సినిమాల్లో ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ సీన్స్ తోనే ప్రేక్షకులను స్టోరీకి కనెక్ట్ చేయాలని చూస్తాడు కృష్ణ వంశీ. అయితే ప్రజెంట్ ప్రేక్షకుల ట్రెండ్ మారింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాక్షన్ ఉన్న కథల పైన ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇక ఫ్యామిలీ టైపు మూవీస్ పై అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి కృష్ణవంశీ ఈ మూవీతో ఏ మేరకు మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైగా రంగమార్తాండ విడుదలైన రోజే విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ రిలీజ్ కానుంది. ఆ తర్వాతి వారంలో నాని తొలి పాన్ ఇండియా మూవీ దసరా విడుదల కాబోతుంది. ధమ్కీ, దసరాల మధ్య రంగమార్తాండ రిలీజ్ చేయటం కొంచెం రిస్క్ గానే కనిపిస్తోంది.
ఎందుకంటే రంగమార్తాండ సినిమా అనుకున్నంత హైప్ రాలేదు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ షాయరీ కూడా ఆలపించారు. అయినా ఈ మూవీకి ఎలాంటి బజ్ రాలేదు. ఇక కృష్ణ వంశీ రంగమర్తాండ మూవీకి హైప్ తెచ్చేందుకు రకాలు ప్రయత్నాలు చేసినా ... అవి ఎలాంటి బజ్ తీసుకురాలేదు. చివరిగా కృష్ణవంశీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఈ సినిమా ప్రీమియర్ షో వేసి ప్రమోట్ చేయటంతో...మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ చేసుందుకు స్టెప్ తీసుకుంది.
ఇక రంగమార్తాండ ప్రీమియర్ చూసిన సెలబెట్రీస్ నుంచి పాజిటివ్ రివ్యూస్ రావటం ఈ సినిమాకి ప్లస్ గా మారింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా పై డైరెక్టర్ కృష్ణవంశీ భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే రంగమార్తాండ లాంటి సాఫ్ట్ కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment