ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానంతం ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం రంగమార్తాండ. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య పాత్రలు పోషించగా ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిలిం నటసామ్రాట్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతుండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్.
ఈ క్రమంలో డైరెక్టర్ కృష్ణవంశీ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'రమ్యకృష్ణ పాత్ర పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశా. మా ఇంట్లో ఏ నిర్ణయమైనా నా భార్యే తీసుకుంటుంది. ఒకవేళ రమ్య లేనప్పుడు మేము నిర్ణయం తీసుకున్నా దానిలో మార్పులు చేర్పులు చేయమని సూచిస్తుంటుంది. కానీ, నేను పెద్దగా పట్టించుకోను.. అది వేరే విషయం. ఇకపోతే రమ్యకు శక్తివంతమైన కళ్లు ఉన్నాయి. అరుపులు, కేకలు కాకుండా కళ్లతోనే నటించాలనగానే ఆమె ఈ సినిమా ఒప్పుకుంది. తన మేకప్, హెయిర్ స్టైల్ తనే చేసుకుంది. తనెప్పుడూ ఒక విజన్‌తో ముందుకెళ్తుంది.
ఈ సినిమాలో లాస్ట్ చాప్టర్‌లో తనను షూట్ చేయడానికి చచ్చిపోయాననుకో! దాదాపు 36 గంటలపాటు షూటింగ్ జరిగింది. తనను ఆ సీన్‌లో చిత్రీకరించడానికి సెంటిమెంట్ అడ్డొచ్చింది, కానీ తప్పదు కదా! షూట్ చేస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రాత్రి నేను సరిగా నిద్రపోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశా' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు కృష్ణవంశీ.
Comments
Please login to add a commentAdd a comment