మంచా.. చెడా? | Powerful angle in Regina | Sakshi
Sakshi News home page

మంచా.. చెడా?

Published Sun, Jul 10 2016 11:50 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

మంచా.. చెడా? - Sakshi

మంచా.. చెడా?

ఖాకీ చొక్కా వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని లాఠీ పట్టుకుని రెజీనా చాలా కొత్తగా కనిపిస్తున్నారు కదూ! ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో కనిపించిన రెజీనా వేరు.. ఇప్పుడు కనిపించనున్న రెజీనా వేరు. ఆమెలోని పవర్‌ఫుల్ యాంగిల్‌ని చూపించనున్నారు దర్శకుడు కృష్ణవంశీ. సందీప్ కిషన్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నక్షత్రం’.


ఇందులో రెజీనా పోలీస్‌గా నటిస్తున్నారు. మంచి పోలీస్‌గా నటిస్తున్నారా? లేదా చెడ్డ పోలీస్‌గా నటిస్తున్నారా? అనేది చిత్రం చూసి తెలుసుకోవాలంటున్నారు హీరో సందీప్. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. కథానాయికలను చాలా అందంగా చూపిస్తారని కృష్ణవంశీకి పేరు. అందుకే, ప్రతి కథానాయిక ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. పోలీస్‌గా రెజీనాను ఎలా చూపిస్తారో? అన్నట్టు.. ‘రొటీన్ లవ్‌స్టోరీ’, ‘రా రా కృష్ణయ్య’ చిత్రాల తర్వాత సందీప్, రెజీనా కలసి నటిస్తున్న మూడో చిత్రమిది. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించడం ఇద్దరికీ ఇది తొలిసారి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement