రక్షించేవాళ్లకు ఎందుకు భయపడాలి? | nakshathram movie release on August 4 | Sakshi
Sakshi News home page

రక్షించేవాళ్లకు ఎందుకు భయపడాలి?

Published Sun, Jul 23 2017 11:37 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

రక్షించేవాళ్లకు ఎందుకు భయపడాలి? - Sakshi

రక్షించేవాళ్లకు ఎందుకు భయపడాలి?

ప్రజల రక్షణ కోసమే ఉన్న పోలీసుల్ని చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేసినోళ్లు భయపడాలి తప్ప సాధారణ ప్రజలు ఎందుకు భయపడాలి? అనే అంశాలను చర్చించడంతో పాటు ఓ అంతర్జాతీయ సమస్యను స్పృశిస్తూ... దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన సినిమా ‘నక్షత్రం’. సందీప్‌ కిషన్, రెజీనా, సాయిధరమ్‌ తేజ్, ప్రగ్యా జైస్వాల్‌ ముఖ్యతారలుగా కె. శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఆగస్టు 4న సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘పోలీస్‌ అవ్వాలని ప్రయత్నించే ఓ యువకుడి కథే ఈ సినిమా. హనుమంతుని శక్తియుక్తులు, సేవాభావం పోలీసుల్లో కనిపిస్తాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఏదైనా సమస్యను చివరికి పరిష్కరించేది పోలీసే. మనం వాళ్లను చూసే దృక్పథం మారాలని ఈ సినిమాలో చెప్పా’’ అన్నారు. తులసి, జేడీ చక్రవర్తి, ప్రకాశ్‌రాజ్, శివాజీరాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్, పద్మశ్రీ, కిరణ్‌ తటవర్తి, సంగీతం: భీమ్స్, భరత్, హరి గౌర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement