విదేశాల నుంచి దిగిన ఆ కుర్రాడికి మట్టి విలువ తెలీదు. కానీ మనిషి విలువ తెలుసు. మనసుల్ని చదవడం తెలుసు. తెగిన బంధాలను కలపడం తెలుసు. అందుకే... దూరమైన తనవారందర్నీ ఒక్కటి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. చివరకు ఆ కుటుంబం పాలిటి గోవిందుడయ్యాడు. కృష్ణవంశీ-రామ్‌చరణ్‌ల ‘గోవిందుడు అందరివాడేలే’ కథ సింపుల్‌గా ఇదే. ఇప్పటివరకూ యాక్షన్ సినిమాలకే పరిమితమైన రామ్‌చరణ్... తొలిసారి పూర్తిస్థాయి కుటుంబ కథలో నటిస్తున్నారు.
నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ.. చిత్రాల తరహాలో కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేశ్ దర్శకుడు. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ని ఆగస్ట్ 1 నుంచి లండన్‌లో జరుపనున్నారు. యువన్ శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్ట్ 22కు రెండు రోజుల ముందు విడుదల చేయడానికి నిర్మాత బండ్ల గణేశ్ సన్నాహాలు చేస్తున్నారు.
అక్టోబర్ 1న దసరా కానుకగా ‘గోవిందుడు అందరివాడేలే’ విడుదల కానుంది. ఈ సినిమా గురించి చరణ్ చెబుతూ -‘‘నా కెరీర్‌లో దసరా కానుకగా విడుదల కాబోతున్న తొలి సినిమా ఇది. అందుకే... ఆత్రుతగా ఉంది. ఇటీవలే సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూశాను. నాతో సహా ప్రతి ఆర్టిస్టూ అందంగా కనిపించారు. ఆ క్రెడిట్ మొత్తం మా కెమెరామేన్ సమీర్‌రెడ్డిదే. మొన్ననే కృష్ణవంశీ ఓ పాటను చిత్రీకరించారు. ఆ పాటలో నా గెటప్ గమ్మత్తుగా ఉంది. కృష్ణవంశీ నాతో ఓ ఫన్నీ గెటప్ వేయించారు. చూడ్డానికే చాలా భిన్నంగా ఉంది. నా కెరీర్‌లో ఓ మెమరబుల్ సినిమాగా ఇది నిలుస్తుంది’’ అన్నారు. కాజల్ అగర్వాల్ కథా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, నిర్మాణం: పరమేశ్వరా ఆర్ట్స్.
నా గెటప్ గమ్మత్తుగా ఉంది!
Published Sat, Jul 12 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM
Advertisement
Advertisement