నవ్విస్తూ... కవ్విస్తూ... లవ్విస్తూ | Making happy, naughty, lovingly | Sakshi
Sakshi News home page

నవ్విస్తూ... కవ్విస్తూ... లవ్విస్తూ

Published Wed, May 28 2014 10:41 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

నవ్విస్తూ... కవ్విస్తూ... లవ్విస్తూ - Sakshi

నవ్విస్తూ... కవ్విస్తూ... లవ్విస్తూ

కృష్ణవంశీ సినిమా అంటేనే ఓ ఫెస్టివల్ మూడ్‌ని తలపిస్తుంది. కామెడీకి కామెడీ... రొమాన్స్‌కి రొమాన్స్... సెంటిమెంట్‌కి సెంటిమెంట్. నవరసాల్ని అందంగా సమ్మిళితం చేసి సుందరంగా సినిమాను తీర్చి దిద్దుతారాయన. రామ్‌చరణ్‌తో కృష్ణవంశీ చేస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే’ ఇదే తరహాలో ఉంటుందంటున్నారు నిర్మాత బండ్ల గణేశ్. రామచరణ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, జయసుధ ముఖ్య జంటగా నటిస్తున్నారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ మరో కీలకమైన జోడీగా కనిపించనున్నారు.
 
 ఈ సినిమా విశేషాలను బండ్ల గణేశ్ వివరిస్తూ -‘‘కన్యాకుమారి, పొలాచ్చిల్లో భారీ షెడ్యూల్స్ చేశాం. జూన్ 5 నుంచి హైదరాబాద్‌లోని రామానాయుడు సినీ విలేజ్‌లో జరిపే షెడ్యూల్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నాం. అనంతరం లండన్‌లో షూటింగ్ చేస్తాం. రామ్‌చరణ్, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్‌ల మధ్య నడిచే సన్నివేశాలు ఆద్యంతం నవ్విస్తాయి. రామ్‌చరణ్, కాజల్ మధ్య రొమాన్స్ చాలా లవ్లీగా ఉంటుంది. ఇటీవలే సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా మూడు పాటలు రికార్డ్ చేశారు’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement