కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్
కృష్ణవంశీతో పనిచేయాలన్న రామ్‌చరణ్ కల నెరవేరుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం చాలా నిరాడంబరంగా మొదలైంది.
కృష్ణవంశీతో పనిచేయాలన్న రామ్‌చరణ్ కల నెరవేరుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం చాలా నిరాడంబరంగా మొదలైంది. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై రామ్‌చరణ్ క్లాప్ ఇవ్వగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేశారు. ఫైనాన్షియర్ సత్యరంగయ్య గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ -‘‘రామ్‌చరణ్‌కి ఇది వైవిధ్యమైన సినిమా అవుతుంది. చక్కటి కుటుంబ బంధాలు, తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా కృష్ణవంశీ అద్భుతంగా కథ సిద్ధం చేశారు. తమిళ నటుడు రాజ్‌కిరణ్ కీలకపాత్ర చేస్తున్నారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూడు రోజులూ హైదరాబాద్‌లో చిత్రీకరణ చేసి, తర్వాత 40 రోజుల పాటు రామేశ్వరం, నాగర్ కోయిల్, పొల్లాచ్చిల్లో షెడ్యూల్ చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి.