కృష్ణవంశీ చిత్రానికి ఏర్పాట్లు షురూ!
‘ఎవడు’ సినిమా విజయంతో మంచి ఉత్సాహం మీద ఉన్న రామ్‌చరణ్, నెక్ట్స్ కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘ఎవడు’ సినిమా విజయంతో మంచి ఉత్సాహం మీద ఉన్న రామ్‌చరణ్, నెక్ట్స్ కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇమేజ్‌ని కాకుండా హీరోలోని ఆర్టిస్టిక్ యాంగిల్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేసే సృజనాత్మక దర్శకుడు కృష్ణవంశీతో పని చేయాలని చరణ్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. కృష్ణవంశీ శక్తిమంతమైన కథ సిద్ధం చేయడంతో సినిమా వెంటనే పట్టాలెక్కేస్తోంది. ఫిబ్రవరి 6న చిత్రీకరణ మొదలు కానుంది.
ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లోని రామానాయుడు సినీవిలేజ్‌లో సెట్‌వర్క్ కూడా మొదలు పెడుతున్నారు. బండ్ల గణేష్ భారీఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో చరణ్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. మగధీర, నాయక్ తర్వాత వీరి కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. కమలినీ ముఖర్జీ ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఎస్.ఎస్.తమన్ స్వరాలందిస్తున్నారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ -‘‘చాలా క్రేజీ ప్రాజెక్ట్ ఇది. చరణ్ కెరీర్‌లోనే నంబర్‌వన్‌గా నిలిచేలా ఈ చిత్రాన్ని కృష్ణవంశీ తీర్చిదిద్దబోతున్నారు’’ అని తెలిపారు.