
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్‌రాజ్
విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్‌రాజ్ నిర్మాతగా మారుతున్నారన్నది తాజా సమాచారం. నటుడు, నిర్మాత, దర్శకుడు అంటూ పలు రంగాల్లో తనదైన శైలిలో చిత్రాలు
విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్‌రాజ్ నిర్మాతగా మారుతున్నారన్నది తాజా సమాచారం. నటుడు, నిర్మాత, దర్శకుడు అంటూ పలు రంగాల్లో తనదైన శైలిలో చిత్రాలు చేస్తున్న ప్రకాష్‌రాజ్ ఇటీవల హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో రూపొం దించిన ఉన్ సమయిల్ అరైయిల్ చిత్రం కన్నడంలో మంచి విజయం సాధించినా, తమిళం, తెలుగు భాషల్లో నిరాశపరచింది. దీంతో చిన్నగ్యాప్ తీసుకున్న ప్రకాష్‌రాజ్ నిర్మాతగా ఒక చిత్రాన్ని నిర్మించడానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నటి రమ్యకృష్ణ భర్త అయిన కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో నూతన జంట హీరో హీరోయిన్లుగా నటించనున్నారని కోలీవుడ్ టాక్. కృష్ణవంశీకి ప్రకాష్‌రాజ్ అంటే చాలా అభిమానం. ఆయన చిత్రాల్లో ప్రకాష్‌రాజ్ పాత్రలు చాలా ప్రధానంగా ఉంటాయి. ఆ అభిమానంతోనే ప్రకాష్‌రాజ్ తన చిత్రానికి దర్శకుడిగా కృష్ణవంశీని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది.