పవన్‌ కల్యాణ్‌కి ప్రకాష్ రాజ్ మరో సూటి ప్రశ్న | War Of Words Continues, Prakash Raj Shared Another Post On Pawan Kalyan, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Prakash Raj - Pawan Kalyan: మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడమా?

Published Fri, Sep 27 2024 11:15 AM | Last Updated on Fri, Sep 27 2024 3:05 PM

Prakash Raj Another Tweet On Pawan Kalyan Latest

తనని తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకొంటున్న పవన్ కల్యాణ్‌కి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వరస షాకులు ఇస్తున్నాడు. గత రెండు రోజులుగా ట్విటర్‌లో ప్రకాశ్ రాజ్-పవన్ మధ్య పెద్ద వార్ జరుగుతోంది. తాజాగా మరో ట్వీట్ చేసి పవన్ కల్యాణ్ తీరుని ఎండగట్టారు. మనకేం కావాలి అని ప్రశ్నిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని లేవనెత్తారు.

(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)

ట్వీట్‌లో ఏముంది?
'మనకేం కావాలి... ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా..‌ పరిపాలనా సంబంధమైన..‌ అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్' అని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చాడు.

ఏం చెప్పాలనుకున్నారు?
ప్రకాశ్ రాజ్ గత ట్వీట్స్‌తో పోలిస్తే ఈసారి పవన్ కల్యాణ్ తన మాటలతో ప్రజల భావోద్వేగాలని ఎలా రెచ్చగొడుతున్నారో అనేది చెప్పకనే చెప్పారు. దీని ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారా అని పవన్‌ని సూటిగా ప్రశ్నించారు.  మరి ఈ ట్వీట్‌పై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి?

ఎందుకింత అయోమయం పవన్..

(ఇదీ చదవండి: 'దేవర' చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement