
చరణ్‌కి అన్నయ్యను కాదు... బాబాయ్‌నే
చరణ్‌కి నేను అన్నయ్యను కాదు. బాబాయ్‌నే’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు.
‘‘చరణ్‌కి నేను అన్నయ్యను కాదు. బాబాయ్‌నే’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. రామ్‌చరణ్ కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మిస్తున్న చిత్రంలో రామ్‌చరణ్ అన్నయ్యగా శ్రీకాంత్ నటించనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. శుక్రవారం శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ -‘‘నేను ఇందులో చరణ్‌కి బాబాయ్‌గా నటిస్తున్నాను. యంగ్ బాబాయ్‌ని అన్నమాట.
కృష్ణవంశీ ఓ అద్భుతమైన కథాంశాన్ని సిద్ధం చేశారు. కుటుంబ సమేతంగా చూసి ఆస్వాదించే అన్ని అంశాలూ ఉన్న కథ ఇది. కృష్ణవంశీ మార్కు వినోదం పుష్కలంగా ఉంటుంది. చరణ్ కెరీర్‌లో కచ్చితంగా ప్రామిసింగ్ హిట్ అవుతుంది’’ అని చెప్పారు.