అనంతపురం: ప్రభుత్వ పాఠశాలలో విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు తగిలి నాలుగో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం 85నెట్టూరు గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కృష్ణవంశీ అనే విద్యార్థి రోజులాగే బడికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మరణించాడు. ట్రాన్స్ కో, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ట్రాన్స్కో ఏఈ భీమలింగప్ప సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అయితే ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు ఏఈపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.